

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్.24
ప్రతినిధి:ప్రిన్స్
అక్టోబర్:10
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసిపి నేత, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు తండ్రి రామరాజును రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ శుక్రవారం ధర్మవరం మురళి రాజు నివాసంలో పరామర్శించారు.గత కొన్ని రోజులు క్రితం రామరాజుపై రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా అక్రమ కేసు బనాయించిన సంగతి విదితమే.ఈ మేరకు పిల్లి బోస్, తనయుడు సూర్య ప్రకాష్ లు రామరాజును మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.అక్రమ కేసు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఈ సందర్భంలో ముదునూరి రామరాజు,వైసిపి నాయకులు,శ్రేణులు తదితరులు ఉన్నారు.