Home ఆంధ్రప్రదేశ్ అగ్ని ప్రమాద బాధితుడికి అండగా.. ఎమ్మెల్యే బత్తుల!;

అగ్ని ప్రమాద బాధితుడికి అండగా.. ఎమ్మెల్యే బత్తుల!;

by VRM Media
0 comments

Vrm media

— కోరుకొండ మండలం దోసకాయల పల్లి లో అగ్నిప్రమాదం

— సుమారు 40 మేకలు సహా సర్వం కోల్పోయిన కుటుంబం

— తన సొంత డబ్బులు రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన ఎమ్మెల్యే బత్తుల దంపతులు

— అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే బత్తుల భరోసా

— ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తో పాటు రుణాన్ని మంజూరు చేయించేందుకు హామీ

దోసకాయలపల్లి లో జరిగిన అగ్ని ప్రమాదంలో మేకల మందను మేపుకుంటూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్న జుత్తుగా సుబ్రహ్మణ్యం సర్వం కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, నా సేన కోసం నా వంతు రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సుమారు 40 మేకలతో పాటు ఇల్లు, గడ్డివాములు, సర్వం అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ దృశ్యాలు చూసి చలించి పోయిన ఎమ్మెల్యే బత్తుల గారు తన సొంత డబ్బులు లక్ష రూపాయలను బాధిత కుటుంబానికి అందిస్తానని తెలిపారు. వారికి ధైర్యం చెప్పడంతో పాటు అగ్ని ప్రమాదం వల్ల సంభవించిన నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అలాగే మేకలను కొనుగోలు చేయడానికి అవసరమైన రుణాన్ని మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే శ్రీ”బత్తుల బలరామకృష్ణ” గారి సతీమణి నా సేన నా వంతు రాష్ట్ర కో-ఆర్డినేటర్శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి” గారు తెలిపారు.

2,823 Views

You may also like

Leave a Comment