
సిద్దవటం,VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్ :13
వీఆర్ఏలకు ప్రస్తుతం ఇస్తున్న నెలసరి వేతనం రూ. 11 వేలు ప్రభుత్వం ఇస్తుందని దాన్ని రూ. 26 వేలకు పెంచాలని సిద్దవటం మండలం వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు బోవిళ్ల దేవదాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రం అయిన సిద్దవటం లో సోమవారం మండల వీఆర్ఏల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకున్న వీఆర్ఏలకు పదోన్నతి కల్పించాలన్నారు. నామినీలుగా ఉన్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలన్నారు. వీఆర్ఏలకు రాత్రి వేళల్లో డ్యూటీలు వేస్తున్నారని, పగలంతా విఆర్ఓ కాడ పనిచేసే మరల రాత్రికి డ్యూటీ చేయాలంటే తాము దూర ప్రాంతాల నుంచి రావాల్సి వస్తుందన్నారు. రాత్రి డ్యూటీలను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం ఉపాధ్యక్షురాలు అమరావతి, ప్రధాన కార్యదర్శి కిషోర్, కోశాధికారి టి. వి. రమణ, సంఘ సభ్యులు కొండయ్య, ఎం. వెంకటసుబ్బయ్య, తులసి,వెంకట సుబ్బన్న, శ్రావణి, బి. వెంకటసుబ్బయ్య, లక్ష్మీదేవి, సుబ్బమ్మ, తదితరులు పాల్గొన్నారు.