

సిద్దవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్ 13
తెలుగుదేశం పార్టీ కృషి కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులకు రాష్ట్ర కార్యవర్గం తగిన గుర్తింపు ఇచ్చిందని రాష్ట్ర దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు తెలిపారు మండలంలోని కమ్మ పాలెం గ్రామంలో సోమవారం నూతనంగా సింగల్ విండో అధ్యక్షులుగా నియమితులైన దారపు నేనిదశరథ నాయుడుకు తన నివాసంలో ఘనంగా సత్కరించామని తెలిపారు ఈ సందర్భంగా స్టేట్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టిన పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం కష్టపడిన వ్యక్తి దశరథ నాయుడు అని అధికారం ఉంది కదా అని వైసిపి ప్రభుత్వం మా కార్యకర్తలపై ఎన్నో తప్పుడు పెట్టారని కార్యకర్తలకు మనోధైర్యం ఇస్తూ పార్టీ కోసం అంకితభావంతో పని చేసిన వ్యక్తికి రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమ్మట్టి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో సింగిల్ విండో అధ్యక్షులుగా నియమితులు కావడం హర్షించదగ్గ విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు