

.
ఆదివాసీ హక్కులు ఉద్యోగాల సాధన కమిటీ,ఆదివాసీ సంఘాలు ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటీడీఏ ముందు నాలుగు గంటలపాటు ట్రాఫిక్ జామ్ చేసి ముట్టడి.
రంపచోడవరం ప్రెస్ నోట్: VRM Media దుర్గా ప్రసాద్
షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం తక్షణమే ప్రకటించి ప్రత్యేక ఆదివాసీ డిఎస్సి ప్రకటించాలని,ఆదివాసీ హక్కులు,చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని రంపచోడవరం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.సర్మణ్ రాజ్ కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశామని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్,డిఎల్ఓ రాష్ట్ర నాయకులు వంతు బాలకృష్ణ,మడి మురళి తెలిపారు.
.ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు…కంగాల శ్రీనివాస్,మడకం బంగారు బాబు,లోతా రామారావు,రాజ్ కుమార్,టి.పద్మ,మద్దేటి అంజిరెడ్డి,సిరిమల్లి రెడ్డి మాట్లాడుతూ… మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు అరకులో ఆదివాసీ నిరుద్యోగులకు వందశాతం ఉద్యోగాలు స్థానిక ఆదివాసీ నిరుద్యోగులతో భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేసి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ (టీఏసీ) ద్వారా తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని,ప్రత్యేక ఆదివాసీ డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని,ఆదివాసీ ప్రాంతంలో ఉన్న 1/59,1/70చట్టం,పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం,2013 పోలవరం భూసేకరణ చట్టం మొదలైన హక్కులు,చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని ముందుగా ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సెంటర్ మీదుగా ర్యాలీగా రంపచోడవరం ఐటీడీఏ కు చేరుకొని ఐటీడీఏ ముందు నాలుగు గంటలపాటు ట్రాఫిక్ జామ్ చేసి ఐటిడిఏ ముట్టడి చేయటం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జి.లోవ ప్రసాద్,రాజ్ కుమార్,రత్నాకర్, ఎం సూర్య కుమారి,సిహెచ్.శశి ప్రీతం,కారం రామన్న దొర,యలగాడ నాగేశ్వరరావు,కోసు లచ్చన్నదొర,కట్రం దాసు,ఎస్ బాబురావు,సిహెచ్.సన్యాసిరెడ్డి, సిహెచ్ విద్యాసాగర్,ఆదివాసీ నిరుద్యోగులు ప్రజా ప్రతినిధులు,మహిళలు,యువతీ యువకులు,ఆదివాసీ సంఘాల నాయకులు పెసా కమిటీ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు,కార్యదర్శులు మొదలైన వారు పాల్గొన్నారు.