
రాజంపేట పార్లమెంట్ పద్మశాలి సాధికార సమితి అధ్యక్షుడు
ఆలూరు వెంకటసుబ్బయ్య
మేజర్ న్యూస్ ఒంటిమిట్ట అక్టోబర్ 13
ఒంటిమిట్ట మండలం
కొండమాచపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ శివ నారాయణ గత ఐదు సంవత్సరాల నుండి పంచాయతీ కార్యదర్శికి రికార్డులు అప్పజెప్పకుండా పంచాయతీ కార్యాలయం తాళాలు తన దగ్గరే ఉంచుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని రాజంపేట పార్లమెంట్ పద్మశాలి సాధికార సమితి అధ్యక్షుడు ఆలూరు వెంకటసుబ్బయ్య ఒంటిమిట్ట ఎంపీడీవో సుజాతమ్మకు సోమవారం నాడు వినతి పత్రం అందజేశారు. అక్టోబర్11వ తేదీ న 104 వైద్య సేవలందించేందుకు వచ్చిన వైద్య సిబ్బందికి పంచాయతీ కార్యాలయం తాళాలు ఇవ్వకుండా వైద్య సిబ్బందిని ఇబ్బంది పడేలా చేశారు. అంతేకాకుండా డ్వాక్రా సంఘాలను పంచాయతీ కార్యాలయంలో సమావేశాలు జరుపుకోనివ్వడం లేదు గతంలో పలుమార్లు.EORD.KMR. ప్రసాద్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు వెంటనే పంచాయతీ సర్పంచి నుండి పంచాయతీ కార్యదర్శికి రికార్డులను పంచాయతీ కార్యాలయం తాళాలను అప్పగించాలని తెలిపారు లేనియెడల ముఖ్యమంత్రి కి ఉప ముఖ్యమంత్రి కి జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు.