
ఏలేశ్వరం, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్ 24 ప్రతినిధి ప్రిన్స్ అక్టోబర్ 14:–
మండలంలోని ఎర్రవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్యాన పంటల సాగులో యాజమాన్య పద్దతులపై
మండల ఉద్యాన శాఖ అధికారిని దివ్యశ్రీ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.రైతులు ఉద్యాన పంటలను సాగు చేసే విధానాన్ని తెలుసుకున్నారు.ఉద్యానపంటల సాగులో తీసుకోవాల్సిన మెలుకువలను రైతులకు వివరించారు.అనంతరం గ్రామంలో అరటి బొప్పాయి జామ తదిత ఉద్యాన పంటలను రైతుల సమక్షంలో పరిశీలించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ. బయో ఫెర్టిలైజర్ అవేర్నెస్ వీక్ లో భాగంగా ఉద్యాన రైతులకు యాజమాన్య పద్ధతులు మరియు బయో ఫెర్టిలైజర్ వాటిపై అవగాహన కల్పించమన్నారు.రైతులకు లాభసాటిగా ఉండే విధంగా వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు. ఎరువుల వినియోగం తగ్గించే విధంగా రైతులు అలవాటు పడి జీవన ఎరువులు విధానాన్ని పెంపొందించుకోవడం ద్వారా, పర్యావరణ పరిరక్షణతో పాటు భూమి సారవంతంఅయి రైతులకు లాభసాటిగా ఉంటుందని తెలిపారు.ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆఫ్రికన్ నత్తల బెడద రైతులకు ఎక్కువైందని దానిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు, కూటమి నాయకులు బస్సా ప్రసాద్,మైరాల కనకారావు,తోట వెంకటేశ్వరరావు, బండారు సూరిబాబు,వి ఏ ఏ, బి మణికంఠ,వి హెచ్ ఏ,మనోజ్ పలువురు రైతులు పాల్గొన్నారు.