Home వార్తలుఖమ్మం రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంp

రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంp

by VRM Media
0 comments

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం
పదేళ్లలో జరగని సంక్షేమం రెండేళ్లలో అందించాం
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్వేయమని ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని రైతులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని దేశంలో ఎక్కడా లేనివిధంగా వరి క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుందని
సామాన్యుడి సంక్షేమాన్ని గాలికి వదిలేసిన గత ప్రభుత్వం పదేళ్లలో జరగని ప్రజాసంక్షేమాన్ని రెండేళ్లలో అందించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అలాంటి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు అవాక్కులు,చవాక్కులు పేలిస్తే సహించేది లేదని మండల పరిధిలోని యర్రబోయినపల్లి గ్రామపంచాయతీ నందు నూతనంగా ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రం కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి అన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రైతుల శ్రేయస్సుకోసం కోట్ల రూపాయలు హెచ్చించి రైతు భరోసా, భీమా, అదనపు బోనస్ ఇస్తూ మద్దతు ధర కల్పిస్తుందని రైతులు దళారుల మాట్ల విని మోసపోవద్దని అన్నారు. అంతేకాకుండా అధిక దిగుబడి కోసం పంట మార్పిడి చేయాలని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందడానికి సేంద్రియ ఎరువులను వాడితే మంచిదని అన్నారు. రైతన్నలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. పంట మార్పిడి వల్ల భూమి సారవంతంగా మారి అధిగ దిగుబడులు పొందవచ్చని అన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను పెంచామని అన్నారు. అందులో భాగంగా డి సి యం యస్ ఆధ్వర్యంలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని యర్రబోయినపల్లిలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంటకు కనీస మద్దతు ధర పొందాలంటే ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, చెత్త, తాలు, మట్టి పెడ్డలు, రాళ్ళు లేకుండా శుభ్రపరచాలని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు, చెల్లింపులలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆన్ లైన్ విధానాన్ని తీసుకువచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలోనికి ధాన్యం డబ్బులు జమచేయబడుతున్నాయని అన్నారు. కావున ధాన్యాన్ని డిసిఎంఎస్ ద్వారానే అమ్మకాలు చేసి గిట్టుబాటు ధర పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎమ్మార్వో పులి సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ దేవి,ఏ ఓ రూప, సొసైటీ డైరెక్టర్ దొడ్డపునేని శ్రీనివాసరావు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆళ్లకుంట నరసింహారావు,మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తుల రాము,పోట్రు అర్జున్ రావు,మాజీ ఎంపీటీసీ పోట్రు శ్రీనివాసరావు,ఏనుగు సత్యం బాబు, పోట్రు వెంకటేశ్వరావు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏగుపాటి రాంబాబు, సొసైటీ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు, కృష్ణవేణి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

2,818 Views

You may also like

Leave a Comment