Home ఎంటర్‌టెయిన్మెంట్ నితిన్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ వచ్చాడా! – VRM MEDIA

నితిన్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ వచ్చాడా! – VRM MEDIA

by VRM Media
0 comments
నితిన్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ వచ్చాడా!



తెలుగు చిత్రసీమలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)నితిన్(Nithiin)కి ప్రత్యేకమైన స్థానం ఉంది. సుదీర్ఘ కాలం నుంచి సిల్వర్ స్క్రీన్ పై తమదైన పెర్ ఫార్మెన్స్ తో అభిమానులని అలరిస్తూ వస్తున్నారు. కాకపోతే కొంత కాలం నుంచి ఈ ఇద్దరికి విజయం అనేది ఆమడ దూరంలో ఉంటుంది. ఆ చిత్రాల్లో పెర్ఫార్మ్ పరంగా తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించినా, కథతో పాటు కథనం లోని లోపాల వల్ల పరాజయం జరుగుతోంది. ఆ ప్రీవియస్ చిత్రాలైన తమ్ముడు, కింగ్ డమ్ లే ఉదాహరణ.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘రౌడీ జనార్దన్’ అనే చిత్రంతో పాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ. నితిన్ నుంచి మాత్రం కొత్త చిత్రం ప్రకటన రాలేదు. వేణు దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘ఎల్లమ్మ’ కి మొదట నితిన్ ని అనుకున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ లోకి వేరే హీరో వచ్చాడు. రీసెంట్ గా సినీ పరిశ్రమలో వినిపిస్తున్న కథనాల ప్రకారం నితిన్ ని అనుకున్న మరో ప్రాజెక్ట్ లోకి విజయ్ దేవరకొండ వచ్చినట్టుగా తెలుస్తుంది. నితిన్ తో అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ‘మనం’ మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం అనుకుంది. ఈ మేరకు గతంలో కూడా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ ఖాతాలో చేరినట్టుగా తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కి విక్రమ్ కథ చెప్పాడని, విజయ్ కి కూడా నచ్చడంతో త్వరలోనే ఈ చిత్రం గురించి అధికార ప్రకటన రానుందని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. విభిన్న చిత్రాలను ప్రదర్శించే దర్శకుడిగా అయితే విక్రమ్ కుమార్(Vikram k kumar)కి ప్రేక్షకుల్లో మంచి పేరు వచ్చింది.

2,848 Views

You may also like

Leave a Comment