

వివిధ రంగాల్లో జిఎస్టి లాభాలను నియోజకవర్గ ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే – సత్య ప్రభ
ఏలేశ్వరం, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24. ప్రిన్స్ ప్రతినిధి.అక్టోబర్ 16:–
కాకినాడ జిల్లా
ప్రత్తిపాడు నియోజకవర్గం
జిఎస్టి 2.0 పై అవగాహన కల్పించేందుకు 17 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న “సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్స్” ప్రచారంలో భాగంగా ఈరోజు ఏలేశ్వరం పట్టణంలో ద్విచక్ర వాహనాలు,ఆటోలు, ట్రక్కులతో ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిఎస్టి 2.0 అమలుతో వాహన వినియోగదారులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని, వాహన విడిభాగాలు, భీమా, వాహనాల కొనుగోలు వంటి రంగాల్లో ధరలు తగ్గడంతో ఆటోమోటివ్ రంగం మరింత అభివృద్ధి దిశగా సాగుతోందని అన్నారు కార్లు, బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రికల్ వాహనాలు మరియు ఇతర ద్విచక్ర వాహనాల ధరలు తగ్గడంతో ప్రజలకు ప్రత్యక్ష లాభాలు చేకూరుతున్నాయని, జిఎస్టి 2.0 వలన రవాణా రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గడం ద్వారా వినియోగదారులు, వ్యాపారులు, రైతులు సమానంగా లాభపడతారని పేర్కొన్నారు అదే విధంగా, ఎలక్ట్రిక్ వాహనాలపై ఐదు శాతం రాయితీ ఇవ్వడంతో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరిగే అవకాశం ఉందని అన్నారు.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. ర్యాలీ సందర్భంగా రవాణా శాఖ అధికారులు, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. గ్రామంలో కరపత్రాలు పంచుతూ ప్రజలకు జిఎస్టి 2.0 ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.