Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట పీహెచ్సీ సిబ్బందిచే నల్ల బ్యాడ్జీలతో సంఘీభావ నిరసన

ఒంటిమిట్ట పీహెచ్సీ సిబ్బందిచే నల్ల బ్యాడ్జీలతో సంఘీభావ నిరసన

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 17

ఒంటిమిట్ట మండలం.
గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న వైద్యులకు ఇన్సెంటివ్‌లు పెంచాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఇటీవల చేపట్టిన నిరసనకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి సంఘీభావం ప్రకటించారు వైద్య బృందం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు ప్రస్తుత 15 శాతం ఇన్సెంటివ్‌ను 20 శాతానికి పెంచాలని, అలాగే ఉద్యోగ భద్రత, వనరుల సరఫరా వంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతోంది విజయవాడలోని ఉద్యమానికి సంఘీభావంగా ఒంటిమిట్ట పీహెచ్సీ సిబ్బంది చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. వైద్యుల సమస్యలు సాధారణ ప్రజల ఆరోగ్య సేవలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ప్రభుత్వాన్ని తక్షణ చర్యలకు ఆహ్వానిస్తున్నామని వారు స్పష్టం చేశారు వైద్య సేవల ప్రాధాన్యతను గుర్తించి, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బందికి తగిన గుర్తింపు ఇవ్వాలని, ప్రభుత్వ లక్ష్యాలు చేరుకోవాలంటే ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ బలపడాల్సిందే అని వారు హితవు పలికారు.

2,842 Views

You may also like

Leave a Comment