Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర.మనందరి బాధ్యత

ఒంటిమిట్ట స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర.మనందరి బాధ్యత

by VRM Media
0 comments

పంచాయితీ కార్యదర్శి. సుధాకర్ ఆధ్వర్యంలో
ఒంటిమిట్ట మండల హెడ్ క్వార్టర్ లో సైకిల్ ర్యాలీ

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 18

ఒంటిమిట్ట మండలం: స్వర్ణాంధ్ర- స్వచ్ఛ్ ఆంధ్ర
కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రమైన గాలి అని థీమ్ తో శనివారం ఒంటిమిట్ట పంచాయతీ పరిధిలో ఘనంగా సైకిల్ ర్యాలీ మరియు స్వచ్ఛ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. పంచాయతీ సచివాలయం ప్రాంగణం నుంచే విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి స్వచ్ఛతకు సంకేతంగా సైకిల్ ర్యాలీకి నాంది పలికారు. ‘స్వచ్ఛ ఆంధ్ర – మనందరి బాధ్యత’, ‘పరిశుభ్రతే పరమో ధర్మః’, ‘స్వచ్ఛత మన భవిష్యత్తు’ అంటూ నినాదాలతో ఊరంతా మారుమ్రోగింది.
ఎంపీడీవో సుజాత మాట్లాడుతూ — “స్వచ్ఛ ఆంధ్ర మనందరి బాధ్యత. ప్రభుత్వ పథకాల విజయానికి ప్రజల సహకారం అత్యవసరం. మన ఇల్లు, మన పల్లె, మన ఊరు పరిశుభ్రంగా ఉండేలా ప్రతివారూ కృషి చేయాలి. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా తగిన విధంగా వేరు చేసి ఇవ్వాలి. పరిశుభ్రతతో పాటు ప్రజలలో బాధ్యతా భావం పెంపొందించడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యం” అని పేర్కొన్నారు.
ఒంటిమిట్ట ఎస్సై ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ — “స్వచ్ఛత మన భవిష్యత్తు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యానికి మూలం. చిన్న పిల్లల నుంచే స్వచ్ఛతపై అవగాహన పెంపొందించాలి. పోలీసులు కూడా పరిశుభ్రతకు తోడ్పాటు అందించేందుకు ప్రజలతో కలిసి పనిచేస్తారు” అని తెలిపారు.
ఎంఈఓ2 బ్రహ్మయ్య మాట్లాడుతూ — “ఆరోగ్యానికి పరిశుభ్రమైన గాలి, శుభ్రమైన వాతావరణం తప్పనిసరి. పాఠశాలల నుంచే విద్యార్థులలో శుభ్రత సంస్కారం -పెంపొందిస్తే భవిష్యత్తు తరం ఆరోగ్యంగా ఉంటుంది. పరిశుభ్రత అనే విలువను విద్యలో భాగం చేయడం మన బాధ్యత” అన్నారు.
ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ — “సైకిల్ వాడకం పెంచాలి. వాహనాల వల్ల కాలుష్యం అధికమవుతోంది. సైకిల్ వాడకం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది. పంచాయతీ స్థాయిలో సైకిల్ వాడకం ప్రోత్సహించడానికి ప్రచారం కొనసాగిస్తాం” అని పేర్కొన్నారు.
స్వచ్ఛత అనేది అలవాటు కాదు, అది జీవన విధానం కావాలి. – అని ఒంటిమిట్ట సర్పంచ్ కత్తి సుజాత అన్నారు
సైకిల్ ర్యాలీకి విద్యార్థుల ఉత్సాహం
శ్రీ సాయి భారతి హైస్కూల్ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని “స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్ర”, “మన ఊరు మన గౌరవం” అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం వెనుక భాగంలో స్వచ్ఛ ప్రతిజ్ఞ నిర్వహించారు. విద్యార్థులు, అధికారులు కలిసి స్వచ్ఛత పట్ల ప్రతిజ్ఞ చేసి, పర్యావరణ రక్షణలో భాగస్వాములమయ్యారు.
విద్యార్థులకు అరటి పండ్ల పంపిణీ
పట్టణ ప్రజల ముందు ఆదర్శంగా నిలుస్తూ, కార్యక్రమం ముగింపు సందర్భంగా విద్యార్థులకు అరటి పండ్లు పంచారు. ఇది విద్యార్థులలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ కత్తి సుజాత, శ్రీ సాయి భారతి హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సుబ్బరామయ్య, ఏపీవో శివశంకర్ రెడ్డి, ఒంటిమిట్ట చెరువు నీటి సంఘం అధ్యక్షుడు పాటూరు గంగిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ మండల కోఆర్డినేటర్ శైలజ, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

2,823 Views

You may also like

Leave a Comment