

ఒంటిమిట్టZPTC ముద్దు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 21
రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గౌరవనీయులు శ్రీ చమ్మర్ది జగన్ మోహన్ రాజు 54వ జన్మదినం సందర్భంగా కడపలోని మా అమ్మ బడి పిల్లలకు ఒంటిమిట్ట మండలం జడ్పిటిసి శ్రీ అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి ఒంటిమిట్ట మండలం టిడిపి మండల అధ్యక్షులు శ్రీ గజ్జల నరసింహారెడ్డి ఒంటిమిట్ట మండల టిడిపి నేతలతో కలిసి టిఫిన్ ఏర్పాటు చేశారు. పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వారు మాట్లాడుతూ ఎదిగే కొద్దీ ఒదిగి వినయంతో ఉంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల శ్రేయస్సు కొరకు పార్టీ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న మహోన్నత వ్యక్తి చమ్మర్ది జగన్మోహన్ రాజు గారని అన్నారు. వారు అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉంటూ మరెన్నో ఉన్నత పదవులను అందుకొని మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.