Home ఆంధ్రప్రదేశ్ ప్రత్తిపాడు మండలంలో ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పర్యటన

ప్రత్తిపాడు మండలంలో ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పర్యటన

by VRM Media
0 comments

పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను సందర్శించిన ఎమ్మెల్సీ

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ అక్టోబర్ 24:–

కార్పోరేట్,పెట్టుబడి దారులకు మేలు చెయ్యడమే లక్ష్యంగా ఉద్యోగ,కార్మికుల పని దినాలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచుతూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టడం దారుణమని ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి అన్నారు.ప్రత్తిపాడు మండలంలోని పలు ప్రభుత్వ,ప్రైవేట్‌ పాఠశాలను గురువారం ఎమ్మెల్సీ గోపిమూర్తి సందర్శించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ఆయన సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పీపీపీ విధానం పేరుతో ప్రైవేట్‌ వ్యక్తులకు ప్రభుత్వం మెడికల్‌ కళాశాలలను అప్పగిండం వల్ల పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను 80 శాతం పూర్తి చేసిందన్నారు.మిగిలిన 20 శాతం పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చెయ్యాలని డిమాండ్‌ చేశారు.అప్‌గ్రేడ్‌ చేసిన పాఠశాల్లో మౌళిక వసతులు కల్పించాలన్నారు.ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి పాటుపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ అధ్యక్షుడు కోడి శ్రీనివాసరావు యూటీఎఫ్‌ నాయకులు దొడ్డిపట్ల రాజుబాబు,రాపర్తి రామలింగేశ్వరరావు,జీఎస్‌ ప్రసాద్ బాబు స్వామి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

2,851 Views

You may also like

Leave a Comment