Home ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు పూర్తి చేయకుండా బిల్లులు చేయించుకున్న కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలి

మౌలిక సదుపాయాలు పూర్తి చేయకుండా బిల్లులు చేయించుకున్న కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలి

by VRM Media
0 comments

రంపచోడవరం నియోజవర్గం ప్రెస్ నోట్:VRM Media దుర్గా ప్రసాద్

పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముంపు లో ఉన్నటువంటి దేవీపట్నం మండలంలో సుమారు 44గ్రామాలకు ప్రభుత్వం పునరావాసాన్ని ఏర్పాటు చేయటానికి టెండర్ల రూపంలో కాంట్రాక్టర్లు టెండరు సొంతం చేసుకున్నారు. వారి పంట పండింది నిర్వశితుల కడుపు మడింది అన్నట్టుగా కృష్ణునిపాలెం పునరావాస కాలని దుస్థితి ఎటు పోలేనట్టుగా మారింది 2020వరదల బ్యాక్ వాటర్ కారణంగా గ్రామాలు వదిలి పునరావాసాలకు నిర్వశితులు చేరుకున్నారు.
అప్పటికి పునరావాస కాలనీళ్ళో ఒక 60%పనులు పూర్తి అవ్వగా నిర్వశితులు అప్పటికే గగ్గోలు పెట్టేవారు తాటాకు ఇల్లులా వర్షం వస్తే స్లాబ్ లు కారిపోయేవి…పూర్తి స్థాయిలో పాఠశాలల నిర్మాణం లేదు ఏలిమెంట్రీ స్కూల్లు ఈరోజుకు లేక వేరే వేరే భవనాల్లో పాఠ్యభ్యాసం చేస్తున్నారు, సెక్యూరిటీ గా కాలనీ చుట్టూ ప్రహరీ (గోడ )నిర్మాణం సకం కట్టి వదిలేసారువాటి వాటికి కేటాయించిన నిధులు ఎటుపోయాయో తెలీదు,సబ్ ANM భవనం ఎక్కడుందో తెలీదు,డ్రైనేజి వ్యవస్థ అస్థవ్యస్థము గా కట్టి వదిలేసారు ఎక్కడి నీళ్లు,రొచ్చు అక్కడే బయటకు వెళ్లే దారేలేదు,బాత్రూం వ్యస్థాన్ డైరెక్ట్ గా డ్రైనేజీ వ్యవస్థ కు అనుసంధానం చేసేసారు. కాలనీ సమస్యలపై నిర్వశితులు రోజు రోజుకు పిర్యాదలు ఎక్కువైపోవటం పేపర్ లో రావటం గ్రూపుల్లో రావటం తో సంవత్సరం వున్నా కాంట్రాక్టరు యాజమాన్యం సైలెంట్ గా వెళ్ళిపోయారు 2020నుంచి నేటివరకు వచ్చిన రంపచోడవరం నియోజకవర్గం సబ్ కలెక్టర్లు ఎవరు విజిట్ కి వచ్చిన నిర్వశితులు చెప్పే మాటలు వినేవారు కాదు కాంట్రాక్టర్లు ఏది చెప్తే అది మాట్లాడి వెళ్లిపోయేవారు తప్ప నిర్వశితుల సమస్యల పక్కదారే పడ్డాయి.
నేటికీ పునరావాస కాలనీ అలానే వుంది… బ్లూ ప్రింట్ ని సైతం కాంట్రాక్టర్లుకు నచ్చినట్టుగా మార్చేసి బిల్లులు చేయించుకుని వెళ్లిపోయిన టెండర్ వేసిన అటు ప్రభుత్వాన్ని మోసం చేసి నిర్వశితుల దీన పరిస్థితికి కారణం ఐనటువంటి వారిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో పునరావాసం పూర్తి చేసేట్టుగా చూడాలని ఈ సమస్యని అటు రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు మిరియాల శిరీష దేవి గారు దృష్టికి అలానే జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జోతులు నెహ్రు గారి దృష్టికి తీసుకెళ్ళి కేసు నమోదు చేయిస్తానని దేవీపట్నం మండల జనసేన జనసేనపార్టీ అధ్యక్షుడు చారపు వెంకట రాయుడు తెలియచేసారు.

2,834 Views

You may also like

Leave a Comment