
నటి రమ్యకృష్ణ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. అయితే వాటిలో శివగామి క్యారెక్టర్ హైలైట్‌గా నిలుస్తుంది. ఒక విధంగా హీరోకి ధీటుగా నిలిచే క్యారెక్టర్ అది. ఆ పాత్రను అత్యద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు రమ్యకృష్ణ. అయితే బాహుబలి అంటే శివగామి క్యారెక్టర్ కోసం శ్రీదేవిని సంప్రదించారని, ఆ తర్వాతే రమ్యకృష్ణను తీసుకున్నారనే వార్త అప్పట్లో ప్రచారంలో ఉండేది. ఇప్పుడు బాహుబలి రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రీరిలీజ్’ చేస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో శ్రీదేవి ప్రస్తావన మరోసారి వచ్చింది. అసలు బాహుబలి నుంచి శ్రీదేవిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందనే విషయం గురించి చెప్పాల్సి వస్తే.. దీని గురించి శ్రీదేవి, రాజమౌళి స్పందించడం విచిత్రంగా అనిపిస్తుంది.
బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయిన తర్వాత ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి దగ్గర ఈ ప్రస్తావన వచ్చినప్పుడు.. శ్రీదేవిని శివగామిగా తీసుకోవాలని అనుకున్న మాట వాస్తవమే అన్నారు. అయితే ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ అడగడం, తన అసిస్టెంట్స్‌కి కూడా ఫ్లైట్ టికెట్స్ వేయమనడం, హోటల్‌లో ఒక ఫ్లోర్ మొత్తం తనకు నచ్చాలని రాజమౌళి చెప్పడం వంటి కారణాల వల్ల ఆమెను కాదని రమ్యకృష్ణను తీసుకున్నామని చెప్పారు.
ఈ ఇంటర్వ్యూ తర్వాత మరో ఇంటర్వ్యూలో స్పందించారు శ్రీదేవి. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘బాహుబలిలో నన్ను శివగామిగా నటించమని అడిగిన మాట వాస్తవం. అయితే ఆ తర్వాత రాజమౌళి నాతో మాట్లాడలేదు. నాతో మాట్లాడకుండానే ఆయన అలా ఆరోపణ చేయడం బాధ కలిగించింది. నేను ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఏరోజు నాపై ఇలాంటి కంప్లయింట్ రాలేదు. నేను అలా డిమాండ్ చేస్తే దాన్నయితే హీరోయిన్‌గా అన్ని సినిమాలు చేయగలిగేదాన్ని కాదు. ఇది రాజమౌళి మేనేజర్, మా మేనేజర్ మధ్య జరిగిన వ్యవహారంగానే నేను కోరుకుంటున్నాను’ అన్నారు శ్రీదేవి.
ఇప్పుడు ఈ వార్త ఎందుకు బయటికి వచ్చిందంటే.. నటుడు జగపతిబాబు జీ తెలుగులో జయమ్ము నిశ్చయమ్మురా పేరుతో మరోసారి ఒక షో ద్వారా తెలుస్తోంది. ఇటీవల రమ్యకృష్ణ, నిర్మాత శోభు యార్లగడ్డ ఈ షోలో ఉన్నారు. ‘బాహుబలిలో శివగామి క్యారెక్టర్ కోసం మొదట శ్రీదేవిని అనుకున్నారు. అది నువ్వు చేశావు. ఈ విషయం నీకు తెలుసా?’ అని రమ్యకృష్ణను అడిగారు జగపతిబాబు. దానికి రమ్యకృష్ణ షాక్ అయింది. అసలు ఆ విషయం గురించి మీరు చెప్పే వరకు తనకు తెలియదన్నారు. అయితే ఆ క్యారెక్టర్ చేయడం తన అదృష్టం అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.