Home ఆంధ్రప్రదేశ్ వైభవంగా మానసా దేవి విగ్రహ ప్రతిష్టభక్తులను ఆశీర్వదించిన పీఠాధిపతి

వైభవంగా మానసా దేవి విగ్రహ ప్రతిష్టభక్తులను ఆశీర్వదించిన పీఠాధిపతి

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ అక్టోబర్ 26

కడప చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లి గ్రామం లోని శ్రీ దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన మానసా దేవి ఆలయంలో ఆదివారం మానసా దేవి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి బ్రహ్మంగారిమఠం, తోట్లపల్లి అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విరజానంద స్వామి పలు విశిష్టమైన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పీఠాధిపతి విరజానంద స్వామి మాట్లాడుతూ శాంతి స్వరూపిణి మానసా దేవి అమ్మవారిని పూజిస్తే అనుగ్రహం తప్పక లభిస్తుందని సిద్ధవటం మండలం ఎంతో ప్రసిద్ధిగాంచిందని శ్రీశైల దక్షిణముఖ ద్వారా గాంచిన ఈ ప్రదేశంలో మానసా దేవి విగ్రహ , ప్రాణ ప్రతిష్ట చేయడం శుభ పరిమాణం అని సకల శని గ్రహ, దోష నివారణ మరియు పలు సమస్యలతో బాధపడే వారు మానసా దేవి అమ్మవారిని మనశ్శాంతిగా భక్తితో పూజిస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుందని తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్య మాట్లాడుతూ కార్తీక మాసాలలో అమ్మవారిని ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగిందని మానసా దేవి ఆలయం మహా పుణ్యక్షేత్రంగా భక్తులకు అందుబాటులో వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త లక్ష్మయ్య, నిత్య పూజేశ్వర ఆలయ ఇంచార్జ్ ఈవో శ్రీధర్, పలువురు పీఠాధిపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

2,845 Views

You may also like

Leave a Comment