Home ఎంటర్‌టెయిన్మెంట్ కమల్ హాసన్ పై శృతి హాసన్ వ్యాఖ్యలు.. కూతురంటే నీలాగే ఉండాలి – VRM MEDIA

కమల్ హాసన్ పై శృతి హాసన్ వ్యాఖ్యలు.. కూతురంటే నీలాగే ఉండాలి – VRM MEDIA

by VRM Media
0 comments
కమల్ హాసన్ పై శృతి హాసన్ వ్యాఖ్యలు.. కూతురంటే నీలాగే ఉండాలి



అగ్రహీరోలకి మోస్ట్ లక్కీయస్ట్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు ‘కమల్ హాసన్'(కమల్ హాసన్)నట వారసురాలు ‘శ్రుతిహాసన్'(Shruthi Haasan). ఆయా హీరోల అభిమానులు కూడా తమ హీరోకి జోడిగా శృతి హాసన్ ఉండాలని కోరుకుంటారు. ఆమెకున్న హిట్ ట్రాక్ అలాంటిది. ఈ ఏడాది ఆగష్టులో ‘కూలీ'(కూలీ)తో పలరించిన శృతి హాసన్ ప్రస్తుతం విజయ్ సేతుపతి(విజయ్ సేతుపతి)తో ‘ట్రైన్'(ట్రైన్)అనే విభిన్న జోనర్‌కి సంబంధించిన మూవీ చేస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

రీసెంట్ గా శృతిహాసన్ ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నా నటనని మా నాన్న నటనతో కంపార్ట్ చేస్తున్నారు. అలా పోల్చడం వల్ల నేనెప్పుడు ఇబ్బంది పడలేదు. పైగా అలా పోల్చుతూ ఉన్నారంటే మా నాన్న నాతో ఉన్నట్లే కదా. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆయన నుంచే నేర్చుకున్నాను. నాన్న తన సొంత డబ్బుతో సినిమా తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తన పని తాను చేసుకుంటూ వెళ్తారు కానీ బాక్స్ ఆఫ్ ఆఫీస్ నంబర్స్ గురించి ఆలోచించరు. అందుకే బాక్స్ ఆఫీస్ నంబర్స్ నాన్నని ప్రభావితం చేయలేవని శృతి హాసన్ చెప్పుకొచ్చింది.

కమల్ హాసన్ గత కొంత కాలంగా వరుస పరాజయాల్ని ఎదుర్కొన్నాడు. లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం(మణిరత్నం)తో కలిసి ఎన్నో ఆశలతో చేసిన గత చిత్రం థగ్ లైఫ్ కూడా భారీ డిజాస్టర్ ని అందుకుంది. ఈ చిత్రం కమల్ హాసన్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. జూన్ 5 న థియేటర్లలోకి రాగా సుమారు 250 కోట్ల బడ్జెట్ తో ప్రదర్శించబడింది. కనీసం 100 కోట్లు కూడా రాబట్ట లేదు. ఈ చిత్రం ముందు ఇండియన్ 2 కూడా భారీ డిజాస్టర్ ని చవి చూసింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ గురించి శృతి హాసన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2022లో వచ్చిన విక్రమ్ తర్వాత కమల్ ఖాతాలో మరో హిట్ లేదు.

2,823 Views

You may also like

Leave a Comment