

-సల్మాన్ కి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!
-అనిల్ రావిపూడి ప్లేస్ లో వంశీ పైడిపల్లి వచ్చాడా!
-దిల్ రాజు నిర్ణయం ఏంటి!
-ఓజి తర్వాత నెక్స్ట్!
ప్రతి డైరెక్టర్ ‘పవన్ కళ్యాణ్'(పవన్ కళ్యాణ్)తో మూవీ చెయ్యాలని ఆశపడతాడు. పవన్ తో సినిమా చేస్తే తమ ప్రోటాన్షియల్ పెరగడమే కాకుండా సినిమా హిట్ అయితే ఇక తమ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదు. అందుకే పవన్ డేట్స్ ఖాళీగా ఉంటే దర్శకుల్లో పోటీ వాతావరణం ఏర్పడుతుంది. పవన్ రీసెంట్ గా ఓజి(OG)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ హిట్ అనే కంటే పవన్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటడానికి ఒక ఔషధం అని కూడా చెప్పుకోవచ్చు.
ఇక పవన్ ఓజి తరువాత తన కొత్త సినిమా ఎవరితో చేస్తాడనే విషయాన్నీ ప్రకటించలేదు. పైగా నేను రాజకీయాల్లో ఉన్నా సినిమాలు వదులుకోనని తనే చెప్పాడు. ఓజి కి సీక్వెల్ ని స్టార్ట్ చేసాడేమో అని అనుకున్నా టైం పట్టేలా ఉంది. దర్శకుడు సుజిత్ ఆల్రెడీ నాని చిత్రానికి కమిట్ అయ్యాడు. ఈ మూవీ కాంప్లీట్ అయ్యాకే సీక్వెల్ పై సుజీత్ కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఏ డైరెక్టర్, ఏ నిర్మాత ఒప్పిస్తే ఆ చిత్రానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం. కొన్ని రోజుల నుంచి అగ్ర నిర్మాత దిల్ రాజు,పవన్ కాంబోలో మూవీ తెరకెక్కబోతుందన్న వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత పవన్ కొంత గ్యాప్ తీసుకొని దిల్ రాజు సెట్ చేసిన వకీల్ సాబ్ తోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో దిల్ రాజు కి పవన్ సినిమా చేయడం ఖాయంగానే అనిపిస్తుంది.
ఈ చిత్రం అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకుడనే వార్తలు సోషల్ మీడియాలో సైతం వచ్చాయి. ఇది అనిల్ రావిపూడి మార్క్ ప్రకారం ఫ్యామిలీ, ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో పవన్ చేస్తే ఒక వండర్ అవుతుందని అభిమానులు,ప్రేక్షకులు కామెంట్స్ చెయ్యడం మొదలుపెట్టారు. ఇపుడు ఈ చిత్రం అనిల్ రావిపూడి ప్లేస్ లో వంశీ పైడిపల్లి వచ్చి చేరాడనే న్యూస్ తాజాగా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అనిల్ రావిపూడితో దిల్ రాజు కి ఎంత బాండింగ్ ఉందో వంశీ పైడిపల్లి(Vamsi PadipallY)తో కూడా అంతే బాండింగ్ ఉంది. పైగా వంశీ ఇప్పటి వరకు చేసిన ఆరు చిత్రాలలో నాలుగు దిల్ రాజు నిర్మించినవే. దీన్నిబట్టి ఆ ఇద్దరికి సంబంధించి వచ్చే సినిమా న్యూస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చేసుకోవచ్చు.
నిజానికి దిల్ రాజు, వంశీ పైడిపల్లి కలిసి హిందీలో సల్మాన్ ఖాన్(సల్మాన్ ఖాన్)తో చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ కాంబో ప్లేస్ లోకే పవన్, దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబో చేరిందనేది ఫిలిం సర్కిల్స్ లో టాక్. వంశీ పైడిపల్లి రెడీ చేసుకున్న సబ్జెట్ పవన్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని, ఆ సబ్జెట్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ పొలిటికల్ ఇమేజ్‌కి, ఆయన ఐడియాలజీకి సరిపడే స్టోరీ ని వంశీ రెడీ చేశాడని అంటున్నారు. ఇది ఎలాగైనా పవన్ తో సదరు సబ్జెక్టుని ప్రదర్శించాలనే ప్లాన్ లో వంశీ ఉన్నట్టుగా తెలుస్తుంది.
Also Read: కాంతార చాప్టర్ 1 ఓటి డేట్ వచ్చేసింది.. ఇక అభిమానులకి పండగే
ఈ విషయంపై త్వరలోనే పవన్ ని కలవనున్నాడని టాక్. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వచ్చిన అద్భుతమైన ఓజి లాంటి గ్యాంగ్ స్టార్ మూవీ తర్వాత, పవన్ సామాజిక ప్రయోజనంతో కూడిన చిత్రంలో చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వంశీ పైడిపల్లీ మాత్రం ఇళయ దళపతి విజయ్ తో చేసిన వారసుడు తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. 2023 సంక్రాంతి కానుకగా వారసుడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.