Home వార్తలుఖమ్మం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

by VRM Media
0 comments


VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు పట్టణం-TTD కళ్యాణ మండపం- పేదింటి ఆడపడుచులకు అండగా కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్‌ ఉన్నదని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.TTD కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని కల్లూరు మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 49 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి & షాదీముబారక్‌ మొత్తం ₹49,05,684/-రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అర్హులైన వారందరూ కల్యాణ లక్ష్మీ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ యాదవ్,MRO, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కల్లూరు మండల సీనియర్ నాయకులు వసుమర్తి చందర్రావు, కల్లూరు పట్టణ,మండలం కాంగ్రెస్ పార్టీ నాయుకులు,గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,కల్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ లబ్దిదారులు పాల్గొన్నారు..

2,814 Views

You may also like

Leave a Comment