
సిద్దవటం VRM న్యూస్ అక్టోబర్ 28
మొంథా తుఫాన్ వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్ హెచ్చరించారు. మండలకేంద్రమైన సిద్దవటం పెన్నానదిలో నీటి మట్టాన్ని హై లెవల్ వంతెన పై నుంచి మంగళవారం కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్ పరిశీలించారు. అలాగే పెన్నానది పరివాహక గ్రామమైన వంతాటిపల్లి బీసీ కాలనీని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన పెన్నానదిలో నీటి మట్టం పెరిగితే ముంపుకు గురయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని తహసీల్దార్ ఆకుల తిరుమల బాబు కు సూచించారు. అలాగే పెన్నానదిలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్నారు. ఈదురు గాలులు బలంగా వీచినప్పుడు రేకుల షెడ్లు, పూరి గుడిసెల్లో నివాసం ఉన్నవారిని పునరావాస ప్రాంతాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలలో భోజనం, నీటి వసతి, టాయిలెట్స్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అధికారులందరూ తప్పకుండా పాటించి ప్రజలకు ఎలాంటి ప్రాణ, అస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆక