


🌐 VRM మీడియా న్యూస్
రిపోర్టర్ : లక్ష్మయ్య | సత్తుపల్లి | ఖమ్మం జిల్లా
తేదీ : 31-10-2025 (శుక్రవారం)
📍 స్థలం : సత్తుపల్లి నియోజకవర్గం – సత్తుపల్లి పట్టణం – వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డ్
సత్తుపల్లి మార్కెట్ యార్డ్‌లో TGMDC సాండ్ బజార్ను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రతి మెట్రిక్ టన్నుకు ₹1100, మరియు ఇతరులకు ప్రతి మెట్రిక్ టన్నుకు ₹1300 రూపాయల చొప్పున — 365 రోజుల పాటు ఇదే రేటుతో ఇసుక అందజేస్తుందని తెలిపారు.
ఇలాంటి ప్రజా హిత కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి గారికి, మంత్రివర్యులు శ్రీ పొంగులేటి గారికి, శ్రీ తుమ్మల గారికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో TGMDC PO శంకర్ నాయక్, మున్సిపల్ కమిషనర్, MRO, MPDO, హౌసింగ్ AE, SI, ప్రభుత్వ అధికారులు, సత్తుపల్లి పట్టణం మరియు మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.