
– బాక్సాఫీస్‌ని టార్గెట్ చేసిన బాలకృష్ణ, బోయపాటి
– మధ్యప్రదేశ్‌లో నాలుగు రోజులపాటు భారీ సాంగ్
– అఖండ2పై ఇండస్ట్రీలోనూ భారీ ఎక్స్‌పెక్టేషన్స్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ విజయాలు అందుకొని ఇద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రాలుగా నిలిచాయి. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లోనే రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టేందుకు అఖండ2 తాండవం చాలా భారీ స్థాయిలో రూపొందించబడింది.
పవర్‌ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బాలకృష్ణ, బోయపాటి.. ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు అఖండ2 చిత్రంతో రాబోతున్నారు. డిసెంబర్ 5న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ అయినా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది.
ఇది కూడా చదవండి: పవన్‌కళ్యాణ్‌తో దిల్‌రాజు సినిమా.. అనఫీషియల్ న్యూస్‌లో అనేక మార్పులు
అఖండ2పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మేకర్స్ ఈ వారి అంచనాలకు మించే స్థాయిలో ఉన్నారు. అఖండ చిత్రంతో కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించి దానికి సీక్వెల్‌గా వస్తున్న అఖండ2తో మరోసారి బాక్సాఫీస్‌ను టార్గెట్ చేశారు బాలయ్య, బోయపాటి.
ఇది కూడా చదవండి: మాస్ జాతర మూవీ రివ్యూ
ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో అద్భుతమైన పాటను ప్లాన్ చేశారు. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ నవంబర్ 3 నుంచి నాలుగు రోజులపాటు మధ్యప్రదేశ్‌లో జరగనుంది.
బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా ఉండబోతోందని. దానికి సంబంధించిన కొన్ని సీన్స్‌ను మహా కుంభమేళాలో చిత్రీకరించారు. ఆ తర్వాత లెక్కకు మించిన డాన్సర్లతో ఒక భారీ సాంగ్‌ను షూట్ చేశారు. ఇప్పటివరకు విడుదలైన స్టిల్స్‌గానీ, గ్లింప్స్‌గానీ చూస్తే సినిమాలో ప్రేక్షకులను థ్రిల్ చేసే భారీ ఎలిమెంట్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఒక విభిన్నమైన కథతో, డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించబడిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు, ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా!
ఈ సినిమాకి సంబంధించి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా చర్చించుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని మరోసారి అఖండ2లో చూడబోతున్నామని యంగ్ హీరోలు కూడా ఎంతో ఉత్సాహంగా చెబుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సెకండ్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టేందుకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.