అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యురు మండలం చీడిపాలెం గ్రామానికి చెందిన గిరిజనుడు పల్లాల రాంబాబు డెంగ్యూ ఫీవర్ వచ్చి కోమాలోకి వెళ్లిపోయి, రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గంగవరం మండలం పెద్ద అడ్డపల్లి బీజేపీ నాయకురాలు సుధా ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి వద్దకు శనివారం వచ్చి సహాయం చేయాలనీ కోరారు.
తక్షణమే స్పందించిన ఆయన పది వేలు రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ముందు ముందు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా కల్పిచారు..