Home వార్తలుఖమ్మం ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 18 మంది మృతి

ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 18 మంది మృతి

by VRM Media
0 comments

Vrm media

చేవెళ్ల, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో బస్సులోకి టిప్పర్ దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరగటంతో సీట్లలోనే వీరు ఇరుక్కుపోయారు. టిప్పర్ లోని కంకర బస్సులో పడడంతో ముందు వరుసలో ఉన్న 5 సీట్లు డ్యామేజ్ అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ ప్రమాదంలో బస్సులో ఇరుక్కుపోయి.. గాయపడిన 15 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

బస్సు తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తండగా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటీవల జరిగిన కర్నూల్ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయిన ఘటన మరువకముందే.. ఈ ఘటన జరగడం రాష్ట్రంలో విషాదాన్ని నింపింది.. KP

2,814 Views

You may also like

Leave a Comment