
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 2
కార్తీక మాసోత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన వసతులు ఏర్పాటుపై తగు చర్యలు తీసుకున్నామని నిత్య పూజేశ్వర ఆలయ చైర్మన్ జంగిటి రాజేంద్రప్రసాద్ తెలిపారు మండలంలోని వంతాటిపల్లి గ్రామం లంక మల అభయారణ్యంలో వెలిసిన నిత్య పూజేశ్వర కోన కు కార్తీక సోమవారం దృష్టిలో పెట్టుకొని వచ్చే శివ భక్తులకు మెరుగైన వసతులు ఏర్పాటు కొరకై కృషి చేస్తున్నామని చైర్మన్ రాజేంద్రప్రసాద్ తెలిపారు , నిత్యపూజేశ్వర ఆలయ,ఆర్చీల వద్ద పచ్చ తోరణంతో ముస్తాబు చేశామని పంచలింగాల గుడి వద్ద త్రాగునీటి గుండాలలో బ్లీచింగ్ పిచికారి చేసి వన్యప్రాణులు సంరక్షణ కొరకై అపరిశుభ్రత ప్రాంతాలు తొలగింపు చేపట్టి వర్షానికి దెబ్బతిన రహదారిని తాత్కాలికంగా మరమ్మత్తులు చేయించామని భక్తులకు స్వామివారి దర్శనం కలిగే విధంగా తగు ఏర్పాటు తీసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది చంద్ర పాల్గొన్నారు