Home ఎంటర్‌టెయిన్మెంట్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ గొడవ.. అసలు మేటర్ బయటకొచ్చింది! – VRM MEDIA

ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ గొడవ.. అసలు మేటర్ బయటకొచ్చింది! – VRM MEDIA

by VRM Media
0 comments
ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ గొడవ.. అసలు మేటర్ బయటకొచ్చింది!



నీల్ తో ఎన్టీఆర్ గొడవ నిజమేనా?
డ్రాగన్ షూటింగ్ బ్రేక్ కి కారణమేంటి?
తెరవెనుక ఏం జరుగుతోంది?

జూనియర్ ఎన్టీఆర్ (జూనియర్ ఎన్టీఆర్), ప్రశాంత్ నీల్ (ప్రశాంత్ నీల్) కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ ‘డ్రాగన్’. మైత్రి మూవీ మేకర్స్ ఈ యాక్షన్ ఫిల్మ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య మనస్పర్థలు వచ్చాయని.. అందుకే షూటింగ్ కి బ్రేక్ వచ్చిందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. (ఎన్టీఆర్ నీల్)

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో కావడంతో.. ప్రకటనతోనే ‘డ్రాగన్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ లాంటి తిరుగులేని మాస్ హీరోని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో చూపిస్తాడనే ఆసక్తి అందరిలో కనిపించింది. అలాంటిది ఈ మూవీ షూట్ స్టార్ట్ అయిన కొద్దిరోజులకే బ్రేక్ వచ్చింది. ప్రశాంత్ నీల్ వర్క్ తో సంతృప్తి చెందని ఎన్టీఆర్ కొన్ని సూచనలు చేశాడని, దాంతో నీల్ హర్ట్ అయ్యాడని.. అలా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం జరిగింది. హీరో, డైరెక్టర్ మధ్య మనస్పర్థల కారణంగానే.. ‘డ్రాగన్’ షూటింగ్ కి బ్రేక్ పడిందని బలంగా వార్తలు వినిపించాయి. ఈ ముదిరితే.. పూర్తిగా సినిమా ఆగిపోయినా ఆశ్చర్యం లేదని కొందరు ప్రచారం చేశారు. (డ్రాగన్)

ఇది కూడా చదవండి: మాస్ జాతరకు షాకింగ్ కలెక్షన్స్..!

నిజానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మంచి ఫ్రెండ్స్. అలాంటిది వారి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ విధంగానే.. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తల్లో వాస్తవం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరైతే ‘డ్రాగన్’ స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దడం కోసమే.. ప్రశాంత్ నీల్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడని చెప్పుకొచ్చారు.

అయితే ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ కి బ్రేక్ రావడానికి అసలు కారణం ఏంటనేది తాజాగా రివీల్ అయింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. స్క్రిప్ట్ వర్క్ కోసమే బ్రేక్ తీసుకున్నారట. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ‘డ్రాగన్’ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నారట.

ప్రశాంత్ నీల్ గత చిత్రాలు ‘కేజీఎఫ్’, ‘సలార్’ కాకుండా.. ‘డ్రాగన్’ను ఒకే సినిమాగా నిర్ణయించుకున్నట్లు మొదట్లో వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే, ఈ సినిమా రన్ టైం ఏకంగా 3 గంటల 45 నిమిషాల వరకు వస్తుందట. అంత నిడివితో ఒకే సినిమాగా చేయడం రిస్క్ అని భావించి.. ఎన్టీఆర్, నీల్ చర్చించి.. రెండు భాగాలుగా నిర్ణయించారట. ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. అంతేకాదు, డ్రాగన్ రెండు భాగాలను ఒకేసారి షూట్ చేసి.. కొన్ని నెలల గ్యాప్ లోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఓ రకంగా ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

2,807 Views

You may also like

Leave a Comment