
8 గంటల్లో మిస్సింగ్ బాలిక ఆచూకీ
ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ నవంబర్ 3:–
బాలిక మిస్సింగ్ కేసును సుమారు 8 గంటల వ్యవధిలో ఛేదించినట్లు ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మికాంతం తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న (02.11.2025) మధ్యాహ్నం సమయంలో ప్రత్తిపాడు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక తన చదువు విషయంలో తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో ఉన్న సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం,రూ.50,000 నగదు తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోయింది.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ ఘటనపై తల్లిదండ్రులు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై ఎస్ లక్ష్మికాంతం తక్షణమే స్పందించి సెల్‌ఫోన్ టెక్నాలజీ సాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు.ప్రత్తిపాడు సిఐ బిఎస్ అప్పారావు పర్యవేక్షణలో పోలీసులు భీమవరం ప్రాంతంలో బాలికను గుర్తించారు.8 గంటల వ్యవధిలోనే బాలికను బంగారం, నగదుతో సహా సురక్షితంగా కనుగొని ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.ప్రత్తిపాడు పోలీసుల వేగవంతమైన చర్యపై స్థానికులు ప్రశంసలు కురిపించడంతో పాటు ఉన్నతాధికారులు అభినందించారు