

వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరి బాబు
ప్రత్తిపాడు. వి.ఆర్.ఎం.మీడియా
న్యూస్24 ప్రతినిధి. ప్రిన్స్ నవంబర్ 7:–
పార్టీలో కష్టపడే కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ఏలేశ్వరం మండలం సి రాయవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గుమ్ములూరి వెంకటరమణ జిల్లా వాలంటరీ విభాగం ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా వెంకటరమణ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిసి తన సేవలను గుర్తించి పార్టీ పదవి ఇవ్వడం పట్ల గిరిబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గిరిబాబు మాట్లాడుతూ పార్టీకి సేవలు చేసే నాయకులను కార్యకర్తలనుగుర్తించడం జరుగుతుందన్నారు.గుమ్ములూరి వెంకటరమణ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడి పనిచేస్తానన్నారు.ఈ కార్యక్రమం లో గొల్లపల్లి సురేష్, గొల్లపల్లి కాశి, బెహరా దొర బాబు, సామంతుల కుమార్, కోరాడ ప్రసాద్, పోలం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.