
ఒంటిమిట్ట వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు.
ట కోలి. శివారెడ్డి
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్
10
ఒంటిమిట్ట: వైయస్సార్సీపి హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 12న బుధవారం రాజంపేటలో నిర్వహించబోయే ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో గల వైయస్సార్ విగ్రహం వద్ద రాజంపేటలో చేయబోయే ప్రజా ఉద్యమానికి సంబంధించిన గోడపత్రాలను ఆయన ఒంటిమిట్ట నాయకులకు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం రాజంపేట ఆర్డీవో కార్యాలయం వరకు సాగే ఈ ప్రజా ఉద్యమానికి ప్రజలు, వైఎస్ఆర్సిపి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కదలి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేరువ శివ నారాయణ, ఎంపీటీసీ ముమ్మడి నారాయణరెడ్డి, కో ఆప్షన్ నెంబర్ రఫీ, వైఎస్ఆర్సిపి నాయకులు మేకపాటి నందకిషోర్ రెడ్డి, కుండ్ల ఓబుల్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, పన్నెల చంద్ర, నరసారెడ్డి, గురు మోహన్ రాజు, మాధవరెడ్డి, జై చంద్రారెడ్డి, ప్రభాకర్ రాజు, మురళి, నాగార్జున రాజు, ముస్లిం మైనారిటీ నాయకులు జాకీర్ హుస్సేన్, షేక్ తాజూర్ , కత్తి శివ తదితరులు పాల్గొన్నారు.