
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 11
విద్యార్థులకు చదువులు చెప్పే ఉపాధ్యాయులు విద్యార్థులపై దారులు చేయడం పిరికిపంద చర్య అంటూ కడప జిల్లా అఖిలభారత విద్యార్థుల సంఘం జిల్లా కన్వీనర్ అనిల్ కుమార్ మండిపడ్డారు సిద్ధవటం మండలంలోని మాధవరం, 1, పార్వతీపురం గ్రామంలోని ఎస్పీ డివిడి ఎయిటేడ్ సభ హై స్కూల్ నందు తోటి విద్యార్థుల కోసం బెటాలియన్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న శశాంత్ అనే విద్యార్థి తన స్నేహితుల కోసం సోమవారం ఎస్పీ బీవీడీ స్కూల్ లోకి వెళ్లగావిద్యార్థి పై స్కూల్ కరస్పాండెంట్ దాడి చేశారంటూ సమాచారం రావడంతో మంగళవారం అఖిలభారత విద్యార్థుల సంగం జిల్లా కన్వీనర్ అనిల్ కుమార్ గాయపడ్డ విద్యార్థి కుటుంబానికి వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవరం గ్రామం రోడ్ నెంబర్ 6 నందు నివాసమున్న సుశాంత్ అనే విద్యార్థి పై ఎస్పీ పి వి డి కరస్పాండెంట్ మధుసూదన్ ఇతనిపై విద్యార్థి అని చూడకుండా చితక కొట్టడం వల్ల బలమైన గాయాలు తగిలాయని తోటి స్నేహితుల కోసం సరదాగా స్కూల్ కి వస్తే విద్యార్థిపై దాడి చేయడం సబబు కాదని చదువులు చెప్పవలసిన గురువులే విద్యార్థులపై మానసికంగా దాడి చేయడం పట్ల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ సురేష్, ప్రసాదు, విద్యార్థి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు