

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్12
ప్రభుత్వ, స్థలాలు, కనబడితే భూ కబ్జా చేసేందుకు కొంతమంది పెట్రేగిపోయి, యంత్రాలతో చదును చేసి భూకబ్జాయత్నం చేస్తున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తాసిల్దార్ మాధవి లత కు వినతిపత్రం సమర్పించారు సిద్ధవటం మండలంలోని మాధవరం 1 ఎస్ కే ఆర్ నగర్ గ్రామంలోని పెద్దపల్లి రెవెన్యూ సర్వేనెంబర్ 10 69/2 నందు కొంత భాగం స్థలాన్నిజెసిబి యంత్రాలతో చదును చేసి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు భూ కబ్జా యత్నం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం మండల కేంద్రమైన సిద్ధవటం లోని తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం చేనేత కార్మికులు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ జానకి రామయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా గ్రామంలో కొలువుతీరిన శ్రీ శీతల గంగమ్మ తల్లి, శ్రీ మహాలక్ష్మి దేవి, గ్రామదేవతల జాతర మహోత్సవ కార్యక్రమాలు జరిగే కార్యక్రమంలో భాగంగా 30 ఏళ్లగా ఈ స్థలంలో దేవత మూర్తుల సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు జెసిబి యంత్రాలతో చదును చేసిఅధికారులు స్థలాన్ని ఇళ్ల పట్టాలకు మంజూరు చేశారంటూ చదును చేసి భూ కబ్జా యత్నం చేస్తున్నారని అధికారులు పరిశీలించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో, ఎస్ శివ కేశవులు, సి నర్సింహులు, జింక శ్రీనివాసులు, సురేష్ బాబు, బి ఓబులేసు, ఎస్ వెంకటేష్ మునిచింద్ర తదితరు చేనేత కార్మికుల పాల్గొన్నారు