
ఒంటిమిట్ట సబ్ ఇన్స్పెక్టర్
ప్రణయ్ కుమార్ రెడ్డి
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 11
రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన బాంబు పేలుళ్లలో కొంతమంది మరణించారు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఐ అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే తప్పుడు సమాచారాలను నమ్మవద్దని ఒంటిమిట్ట సబ్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా బ్యాగులు కనపడితే డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని సోమవారం రోజున మంటుపంపల్లి చెక్పోస్ట్ రామాలయం దగ్గర ఒంటిమిట్ట బస్టాండ్ దగ్గర కొత్త మాధవరం చెక్పోస్ట్ ను తనిఖీ చేసామని ఈ నేపథ్యంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.