Home ఆంధ్రప్రదేశ్ ధర్మాన్ని ఆచరించి.దానధర్మాలు చేస్తే వారి సంపద ను దేవుడు దినదిన అభివృద్ధి చేస్తాడు

ధర్మాన్ని ఆచరించి.దానధర్మాలు చేస్తే వారి సంపద ను దేవుడు దినదిన అభివృద్ధి చేస్తాడు

by VRM Media
0 comments

నూరుల్లా ట్రస్ట్ అధినేత. అబ్దుల్ క్వారీ సుహాన్

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 15

ఒంటిమిట్ట లోని మలకాటుపల్లి క్రాస్ లో వెలసిన నూరుల్లా ట్రస్ట్ నందు శనివారం నాడు. నూరుల్లా ట్రస్ట్ అధినేత. అబ్దుల్ క్వారీ సుహాన్ యధావిధిగా పింఛన్ కార్యక్రమం నిర్వహించారు
జనవరి 23 నుంచి 25 వరకు కడప లో దీని ఇజ్తిమా
ఇరుగు పొరుగుకు చేతనైన సహాయం చేయాలి
మానవత్వాన్ని కలిగి ధర్మాన్ని ఆచరించాలి
దానధర్మాలు చేస్తే సంపద మరింత వృద్ధి అవుతుంది
జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఛైర్మెన్ డా.క్వారీ అబ్దుల్ సుభాన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల దీని ఇజ్తిమా సమావేశాలు 2026 జనవరి 23,24,25 వ తేదీలలో కడప నగరం సమీపంలోని కొప్పర్తి లో నిర్వహిస్తున్నట్లు జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు డాక్టర్ క్వారీ అబ్దుల్ సుభాన్ తెలిపారు.శనివారం నూరాబాద్ లోని మదరసా జామియా నూరుల్ ఇస్లాం ఆవరణలో పేదలకు ఆర్థిక సహాయం, ఆయుర్వేద మందులు, పండ్లు,గోధుమ పిండి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ కడప జిల్లాలో నిర్వహిస్తున్న దీని ఇస్తిమాకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాల నుంచి సుమారు 5 లక్షల మంది తరలి వస్తారని అంచనా ఉందన్నారు. ఇప్పటికే స్థలం చదును చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. దైవ మార్గంలో నడిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ఇజ్తిమా కు డిల్లీ , హైదరాబాద్ నుంచి మత పెద్దలు వస్తారని తెలిపారు.ప్రతి ఒక్కరు ఇస్తిమాకు రావచ్చని, దైవ సందేశాన్ని వినవచ్చని తెలిపారు.మానవులు మానవత్వంతో జీవించాలని, సృష్టికర్తను ప్రార్థించాలని తెలిపారు. తమ ఇరుగుపొరుగు వారి పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. దానధర్మాలు ఎక్కువగా చేస్తే సంపద ఏమాత్రం తరిగిపోదని.. దేవుడు అలాంటి వారికి మరింత సంపదను ఇస్తాడన్నారు. అల్లా కృపతో జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ద్వారా పేదలకు తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరు మానవత్వంతో జీవించాలని,ధర్మ మార్గంలో నడవాలని హితవు పలికారు. సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తే, పేదల ఆకలి తీర్చడంతో పాటు అభాగ్యులను ఆదుకున్న వారము అవుతామని ఆయన వివరించారు. కడపకు చెందిన ముస్లిం ప్రముఖులు అక్బర్ మాట్లాడుతూ ఇస్తిమాలో ముస్లిం మత పెద్దలు బోధించే జీవిత సత్యాలను తెలుసుకోవాలంటే తప్పనిసరిగా రావాలని కోరారు. ప్రతి ఒక్కరిలోనూ భక్తి భావం పెంపొందాలని అప్పుడే మానవజాతి అంతా సుఖ సంతోషాలతో ఉంటుందన్నారు. మన కడపలో భారీ స్థాయిలో ఇస్తిమా నిర్వహించడం మనందరికీ ఎంతో గర్వకారణమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజలు,దివ్యాంగులు,ఇమామ్ లు,మౌజన్లు పాల్గొన్నారు.

2,823 Views

You may also like

Leave a Comment