Home వార్తలుఖమ్మం ,,,తెలంగాణ జన సమితి మండల అధ్యక్షుడు బీరెల్లి వాసు డిమాండ్,,,

,,,తెలంగాణ జన సమితి మండల అధ్యక్షుడు బీరెల్లి వాసు డిమాండ్,,,

by VRM Media
0 comments

Vrm Media శ్రీనివాస్ బోనకల్ 15,11,2025

చిరునముల గ్రామంలో అసైన్మెంట్ ల్యాండ్ లో జరుగుతున్న మట్టిమాఫియా,దందాను అరికట్టాలి,తక్షణమే తవ్వకాలను నిలుపుదల చేయాలి,

బోనకల్ మండలం చిరునముల గ్రామపంచాయతీలో పరిధిలో ప్రభుత్వ అసైన్మెంట్ ల్యాండ్ లో మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని గతంలో అధికారులు దృష్టికి తీసుకువచ్చినప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు వారు వచ్చినప్పుడు రెండు రోజులు ఆపడం మరలా ఎదేచ్చుగా మట్టి తవ్వకాలు నిరంతరం సాగిస్తున్నారు మట్టి మాఫియా గ్రామంలో చెలరేగిపోతుంది లింకు సిస్టం (కమిషన్లు) ద్వారా పెద్ద ఎత్తున మట్టి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు,ఇందిరమ్మ ఇల్లు,అవసరాల పేరుతో ఈ నాటకాలు కొనసాగుతున్నాయి ప్రతిరోజు వందలాది ట్రాక్టర్ల తిరుగుతున్నాయి గ్రామ రోడ్లు పాడై దుమ్ము ధూళితో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు,మట్టిని రోడ్ల కోసం చిన్న, పెద్ద కాంట్రాక్టర్లకు అమ్ముకుంటున్నారు,

,,గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా జరుగుతా ఉంది పంచాయతీ ఆదాయాన్ని కూడా కండి కొడుతున్నారు,గుట్టల దగ్గర మైనింగ్ మాఫియా, జెసిపిలు, ప్రోక్లైన్ల ద్వారా తవ్వకాలు కొనసాగిస్తా ఉంటే మండల కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో కోట్ల రూపాయల దందా, అవినీతి అక్రమాలు జరుగుతుంటే అధికారుల కండ్లకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు ఎటువంటి పర్మిషన్ లేకుండా రాజకీయ అండ చూసుకొని కొందరి ఇదే పనిగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడాల్సినటువంటి ప్రకృతి ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు, ఈ మట్టిదంధాన్ని నివారించాలి,,

,,అసైన్మెంట్ ల్యాండ్ లో,నిబంధనలకు విరుద్ధంగా
జరుగుతున్న మైనింగ్ దోపిడి అరికట్టాలని, ఇప్పటివరకు జరిగిన మట్టి తవ్వకాల పై మండల రెవిన్యూ అధికారులు తక్షణమే ఫీల్డ్ మీదకు వెళ్లి పరిశీలన చేసి శాఖపరమైన విచారణ జరిపి దానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, జిల్లా మైనింగ్ అధికారులు కూడా తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలి, లేనియెడల భవిష్యత్తు లో ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నాం,

ఇట్లు
బీరెల్లి వాసు
తెలంగాణ జన సమితి
మండల అధ్యక్షులు బోనకల్

2,819 Views

You may also like

Leave a Comment