నెహ్రూ జయంతి మరియు వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యువజన కాంగ్రెస్ తెలంగాణ మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన షైన్ హై స్కూల్ లో వ్యాసరచన పోటీ నిర్వహించారు..
విజేతలుగా నిలిచిన వారికి ఈరోజు ఖమ్మం లో రామ భక్త కాళాక్షేత్రంలో బహుమతులు అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా MP రామ సహాయం రఘురామ రెడ్డి గారు, తుమ్మల యుగంధర్ గారు,కాంగ్రెస్ పార్టీ నాయకులు భానోత్ విజయబాయ్ గారు,యడవల్లి సంతోష్ గారు విచ్చేసారు.ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండంట్ అన్సార్ పాషా మాట్లాడుతూ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.. ఈ కార్యక్రమం లో కరెస్పాండంట్ అన్సార్ పాషా, డైరెక్టర్ లాల్ మహమ్మద్, ప్రిన్సిపాల్ శ్వేత, అడ్మినిస్ట్రేషన్ నాగేశ్వరావు, గణిత భోదకులు నాగుల్ మీరా, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

