Home వార్తలుఖమ్మం నష్టపోయిన పత్తి రైతులకు మద్దతు ధర కల్పించాలని బిఆర్ఎస్ పార్టీ ధర్నా

నష్టపోయిన పత్తి రైతులకు మద్దతు ధర కల్పించాలని బిఆర్ఎస్ పార్టీ ధర్నా

by VRM Media
0 comments
Vrm Media ప్రతినిధి ఖమ్మం రాంబాబు

పత్తి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను వెంటనే చెల్లించాలని ఖమ్మం BRS పార్టీ నాయకులు డిమాండ్ించారు. వరుసగా పెరుగుతున్న వ్యయభారం, తక్కువ మార్కెట్ ధరల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కోరారు.

రైతుల నిజమైన వ్యయానికి సరిపడేలా ఏకరీతి మద్దతు ధరను అత్యవసరంగా చెల్లించడంతో పాటు ప్రతి రైతుకు రూ.10,000/- మద్దత్తు ధర ప్రకటించాలని నాయకులు స్పష్టం చేశారు. పత్తి సాగు కష్టసాధ్యమైపోయిన ఈ సమయంలో రైతులకు తోడుగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని వారు పేర్కొన్నారు.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, రైతుల ఆత్మగౌరవం, ఆర్థిక భద్రత కోసం ఈ డిమాండ్లు అత్యవసరమని BRS నాయకులు హితవు పలికారు.

2,841 Views

You may also like

Leave a Comment