Home ఆంధ్రప్రదేశ్ సిద్దవటం మండలంలో టీడీపీ నూతన పార్టీ కార్యాలయం పరిశీలన

సిద్దవటం మండలంలో టీడీపీ నూతన పార్టీ కార్యాలయం పరిశీలన

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 18

రాజంపేట ఇంచార్జి శ్రీ జగన్ మోహన్ రాజు ఆదేశాల మేరకు
సిద్దవటం మండలంలో తెలుగు దేశం పార్టీ నూతన కార్యాలయం కోసం అనువైన భవనం పరిశీలించి ఎంపిక చేయడం జరిగింది. త్వరలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, అలాగే కార్యకర్తలు సౌకర్యంగా చేరుకునేలా ఈ కార్యాలయం సేవలందించనున్నది.
ఈ పరిశీలన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ యాదవ, పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, క్లస్టర్ ఇంఛార్జి ధరపనేని రాజా నాయుడు, బీసీ అసెంబ్లీ అధ్యక్షులు కె. చెంచయ్య నాయుడు, పంచాయతీ రాజ్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కుప్పాలా వెంకట సుబ్బయ్య, నాయకులు శ్రీనివాసులు, శంకర్ పాల్గొన్నారు.
పార్టీ నాయకులు వెల్లడిస్తూ— కొత్త కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్రబిందువుగా నిలుస్తుందని, త్వరలో గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

2,830 Views

You may also like

Leave a Comment