Home ఎంటర్‌టెయిన్మెంట్ తాజాగా 21న యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ‘మఫ్టీ పోలీస్’..! – VRM MEDIA

తాజాగా 21న యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ‘మఫ్టీ పోలీస్’..! – VRM MEDIA

by VRM Media
0 comments
తాజాగా 21న యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల 'మఫ్టీ పోలీస్'..!



యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేష్ ల పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా “తీయవర్ కులై నడుంగ” తెలుగులో “మఫ్టీ పోలీస్”గా 21వ ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్సార్ ఆర్ట్స్ బ్యానర్ పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ… తెలుగులో “మఫ్టీ పోలీస్” పేరుతో శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా ప్రముఖ నిర్మాత ఇ. ఎన్. బాలాజీ విడుదల చేస్తున్నారు.

ఒక రచయిత హత్య నేపద్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రంలో పర్సనల్ డ్రామాకు పెద్ద పీట వేయడం విశేషం. అలాగే ఇటీవలి కాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఇందులో కనిపించింది.

ఈ తెలుగులో విడుదల చేస్తున్న శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ అధినేత ఎ. ఎన్. బాలాజీ మాట్లాడుతూ… “యాక్షన్ కింగ్ అర్జున్ – ఐశ్వర్య రాజేష్ లకు తెలుగునాట ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక థియేటర్లలో “మఫ్టీ పోలీస్” విడుదలవుతోంది. ఈ సినిమా యాక్షన్ తో పాటు పర్సనల్ డ్రామా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళంతోపాటు తెలుగులోనూ అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. కృతజ్ఞతలు” అన్నారు.

రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా నటించిన ఈ చిత్రం శరవణన్ అభిమన్యు సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ గా భరత్ ఆశీనగన్, ఎడిటర్ గా లారెన్స్ కిషోర్ వ్యవహరించారు.

2,814 Views

You may also like

Leave a Comment