Home వార్తలుఖమ్మం వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారులతో కలిసి మిరప తోటలను పరిశీలించిన కృషి విజ్ఞాన కేంద్రం వైరా శాస్త్రవేత్తలు..

వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారులతో కలిసి మిరప తోటలను పరిశీలించిన కృషి విజ్ఞాన కేంద్రం వైరా శాస్త్రవేత్తలు..

by VRM Media
0 comments

Vrm Media ప్రతినిధి శ్రీనివాస్ బోనకల్

ఈరోజు బ్రాహ్మణపల్లి గ్రామం బోనకల్ మండలం మరియు సిరిపురం గ్రామం, మధిర మండలంలో మిరప తోటలను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సుచరిత దేవి గారు, పావని గారు,చైతన్య గారు మరియు ఉద్యాన శాఖ అధికారి ఏ విష్ణు మరియు బోనకల్ వ్యవసాయ అధికారి వినయ్ గారు, వ్యవసాయ విస్తరణ అధికారి హుస్సేన్ గారు మధిర మండల వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్ గారు మరియ వ్యవసాయ విస్తరణ అధికాకారులు జిష్ణు, గురుమూర్తి మరియు మిరప రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మిరపలో కొమ్మ ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు, నల్ల తామర పురుగులు ఆశించడం జరుగుతుంది.
కొమ్మ ఎండు తెగులు నివారణకు అజాక్సిస్ట్రోబిన్ లేదా ట్రిప్లాక్సిస్ట్రోబిన్ వంటి మందులతో పాటుగా ప్లాంటోమైసిన్ కలిపి పిచికారి చేసుకోవాలని చెప్పారు.
వేరు కుళ్ళు తెగులు నివారణకు ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను వాడాలని సూచించారు.ట్రైకోడెర్మా విరిడి ని ఎటువంటి ఎటువంటి రసాయనక ఎరువులతో కలపకూడదు.
లేదా కాపర్ ఆక్సి క్లోరైడ్ లేదా కాపర్ హైడ్రాక్సైడ్ మందులను ప్లాంటోమైసిన్ కలిపి మొక్క యొక్క వేర్లు తడిచే విధంగా భూమిలో పోయాలని సూచించారు.
నల్ల తామర పురుగులు గత మూడు నాలుగు సంవత్సరాలుగా నల్ల తామర పురుగులు మిరపలో ఆశించడం జరుగుతుంది, ఈ పురుగు యొక్క ఉధృతి ఇప్పుడిప్పుడే గమనించడం జరుగుతుంది. కావున నల్ల తామర పురుగుల నివారణకు వేప నూనెతో పాటుగా థాయోమితాక్షం లేదా ఇమిడక్లోప్రిడ్ +ఫిప్రోనిల్ 40 శాతం లేదా ఫిప్రోనిల్ 80% వంటి మందులను వేప నూనెతో పాటు కలిపి పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు. అలాగే మొక్కకు సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా బోరాన్ మరియు మెగ్నీషియం 15 రోజులకు ఒకసారి పిచికారి చేసుకోవాలని సూచించడం జరిగింది.

2,813 Views

You may also like

Leave a Comment