Home ఆంధ్రప్రదేశ్ నిత్య పూజ కోనలో భక్తుల రద్దీరహదారిపై భారీగా వర్షపునీరుమూతికోన రాయికోన వద్ద దెబ్బతిన్న రహదారి

నిత్య పూజ కోనలో భక్తుల రద్దీరహదారిపై భారీగా వర్షపునీరుమూతికోన రాయికోన వద్ద దెబ్బతిన్న రహదారి

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 24

నిత్య పూజేశ్వర కోనలో వర్షాల కారణంగా కొండ ప్రాంతాల నుండి వర్షపు నీరు భారీగా రావడంతో వంకలు సాగుతున్నాయి సిద్ధవటం మండలంలోని వంతాటి పల్లి గ్రామం లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్య పూజేశ్వర కోనకు వెళ్లే ప్రధాన రహదారి పంచలింగాల గుడి సమీప ప్రాంతంలోని మూతికోన రాయి కోన వద్ద అధిక వర్షాల కారణంగా వంకలు సాగడంతో రహదారి కోతకు గురై వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి సోమవారం సందర్భంగా జిల్లా నలుమూల నుండి భక్తులు అధిక సంఖ్యలో నిత్య పూజేశ్వర కోనకు తరలి వెళ్లారు పంచలింగాల గుడి వద్ద కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వంకలు సాగడంతో రహదారిపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తున్న భక్తులు కాలినడకన తమ మొక్కులు తీర్చుకోవడానికి తరలి వెళ్లారు దెబ్బతిన్న రహదారి మరమ్మతులు చేయాలని శివ భక్తులు తెలిపారు
ఈ విషయమై ఇంచార్జ్ ఎండోమెంట్ ఈవో శ్రీధర్ వివరణ కోరగా వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారి మరమ్మత్తులు చేయించామని మూతికోన రాయి సమీపాన దెబ్బతిన్న రహదారిని పరిశీలించి భక్తుల వాహనాల రాకపోకులకు ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాథమిక దిశగా పనులు చేపడతామని మహాశివరాత్రి దృష్టిలో పెట్టుకొని మెరుగైన వసతులు ఏర్పాటు కొరకై చర్యలు తీసుకుంటున్నామన్నారు

2,822 Views

You may also like

Leave a Comment