Home ఆంధ్రప్రదేశ్ టక్కోలు ZPHS స్కూల్‌లో ఆధార్ సెంటర్ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు,

టక్కోలు ZPHS స్కూల్‌లో ఆధార్ సెంటర్ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు,

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 25

నారా లోకేష్ ప్రత్యేక చొరవతో, రాజంపేట ఇంచార్జి శ్రీ జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో పాఠశాలల్లో ఆధార్ సెంటర్ల కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
పిల్లలు తల్లికి వందనం, స్కాలర్‌షిప్‌ల వంటి పథకాల్లో ఆధార్‌కు సంబంధించిన సాంకేతిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, బయట ఉన్న ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్కూల్‌లోనే సులభంగా ఆధార్ అప్‌డేట్‌తో పాటు ఇతర ఆధార్ సేవలను పొందే అవకాశాన్ని కల్పించడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమం భాగంగా ఈ రోజు టక్కోలు గ్రామంలోని ZPHS పాఠశాల‌లో ఆధార్ సెంటర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగ ముని రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగలింగేశ్వర్ రెడ్డి, డిజిటల్ అసిస్టెంట్ రవీంద్ర, పాఠశాల హెడ్‌మాస్టర్ , డ్రిల్ టీచర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చర్యతో గ్రామంలోని విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఆధార్ సంబంధిత సేవలు మరింత సులభంగా, అందుబాటులో లభించనున్నాయి.

2,826 Views

You may also like

Leave a Comment