
అధ్యక్షుడిగా కొద్ది రోజుల కిందటే అమెరికా బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కీలక నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ విధంగానే తన మాట వినని దేశాలపై ట్రంప్ చర్యలు చేపడుతున్నారు. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను తీసుకెళ్లిన విమానాలను విప్పి పంపినందుకు కొలంబియాపై ట్రంప్ తాజాగా కొరడా ఝులిపించారు. త్వరలోనే ఆ దేశంపై భారీ దిగుమతి సుంకాలతోపాటు ట్రావెల్ బ్యాన్ లాంటి ఆంక్షలు అమలు చేయబడ్డాయి ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. కొలంబియా అధ్యక్షుడు పెట్రో అమెరికా జాతీయ భద్రత ప్రమాదంలో పడేసాడని, ఇందుకే కొలంబియా పై చర్యలు అధికారులకు ఆదేశాలు ఇచ్చానంటూ ట్రంప్ పోస్టులో రాసుకు వచ్చారు. కొలంబియా నుంచి దిగిన వస్తువులపై ఎప్పటికి 25 శాతం టారిఫ్ విధిస్తామని స్పష్టం చేశారు.
ఇది రానున్న వారం రోజుల్లో 50 పెరుగుతుందని. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు షాక్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే వెనుకాడబోనని ట్రంప్ ఈ నిర్ణయం ద్వారా మరోసారి స్పష్టం అయింది. కొలంబియా నుంచి అమెరికాకు రావడం పై ట్రావెల్ బ్యాన్, వీటితోపాటు ఆర్థిక ఆంక్షలు ఉంటాయని ట్రంప్ ఏర్పాటు. కాగా రెండో ట్రంప్‌సారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను వారి దేశాలకు పంపుతున్న విషయం తెలిసిందే. అయితే వలసదారులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారిని మిలటరీ వాహనాల్లో పంపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు పెట్రో ట్విట్టర్ వేదికగా ఏర్పాటు చేశారు. తమ దేశానికి చెందిన వారికి గౌరవం ఇస్తూనే.. పౌరుల విమానాల్లో పంపితే తాము స్వాగతిస్తామని ప్రకటించారు. గతవారం మెక్సికో కూడా కొలంబియా సలహాలోనే ట్రంపు వలసదారులతో పంపిన మిలిటరీ హనాలను తిప్పి పంపింది. మరి ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంపై కొలంబియా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మిగిలిన దేశాలు ఈ తరహా చర్యలను ఎలా పరిగణలోకి తీసుకుంటాయి అన్నది కూడా ఆసక్తిగా మారింది.
గతం గతః: రోహిత్ శర్మ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్