Home ఎంటర్‌టెయిన్మెంట్ చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే.. జై బాలయ్య..! – VRM MEDIA

చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే.. జై బాలయ్య..! – VRM MEDIA

by VRM Media
0 comments
చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే.. జై బాలయ్య..!



చరిత్రలో చాలా మంది ఉంటారు
చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే
మరోసారి గర్జించిన బాలయ్య

‘వీరసింహారెడ్డి’ వంటి ఘన విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మరోసారి చేతులు కలిపారు. బాలకృష్ణ కెరీర్‌లో 111వ సినిమాగా రూపొందించబడిన ఈ సినిమాకి ‘NBK111’ అనేది వర్కింగ్ టైటిల్. వృద్ధి సినిమా నిర్మాణం ఈ హిస్టారికల్ ఫిల్మ్.. బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా లాంచ్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్ ఒకటి వైరల్ గా మారింది.

బాలకృష్ణ అంటేనే పవర్ ఫుల్ డైలాగ్ లకు పెట్టింది పేరు. పైగా హిస్టారికల్ ఫిల్మ్ అయిన డైలాగ్ లు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు శాంపిల్ అన్నట్టుగా ఓపెనింగ్ రోజే.. బాలయ్య ఒక పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు.

“చరిత్రలో చాలా మంది ఉంటారు.. చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే.. అదే ఈ చరిత్ర.. నాదే ఆ చరిత్ర…” అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ పై ముహూర్తపు షాట్ ని చిత్రీకరించారు. ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: అఖండ-2 ఇంటర్వెల్.. ఏం హాయ్ రా బాబు…

‘NBK111’లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ కనిపిస్తుంది. ఒక రోల్ లో పవర్ ఫుల్ కింగ్ గా కనిపించనున్నారు. ఆయన సరసన రాణిగా నయనతార నటిస్తోంది.

కాగా, డిసెంబర్ 5న ‘అఖండ-2’తో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలకృష్ణ.

2,825 Views

You may also like

Leave a Comment