తూర్పుగోదావరి జిల్లా గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ లే అవుట్ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది…
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారిచే అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథ రావు శర్మ గారు ప్రత్యేక పూజ, కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు.
అనంతరం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోత్తమంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు..