
కెనడాలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో జస్టిన్ ట్రూడే ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రూడో తరువాత దేశానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అన్నదానిపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ప్రధాని పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ జాబితాలో భారత సంతతి మహిళ అనిత ఆనంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేసిన తరువాత ఈ బాధ్యతలను ఎవరు చేపడుతారు అన్న ప్రశ్న లేవనెత్తినప్పుడు భారత సంతతికి చెందిన మహిళ అనిత ఆనంద పేరు వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆమె వైపు మెజారిటీ సభ్యులు చూస్తున్నట్లు చెబుతున్నారు. మార్చి 24 నాటికి కెనడా కొత్త ప్రధాని ఎన్నిక అయ్యే అవకాశం ఉంది. అంతర్గత వాణిజ్య మంత్రిగా బాధ్యతలను ప్రస్తుతం అనిత ఆనంద్ నిర్వర్తిస్తున్నారు. 2019 నుంచి ఎంపీగా ఉన్న అనిత ఆనంద్.. గడచిన కొన్నాళ్లుగా కెనడా రవాణా, అంతర్గత వాణిజ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గతంలో యూనివర్సిటీ ఆఫ్ టోరంటాలో న్యాయ ఆనందశాఖ ప్రొఫెసర్‌గా వ్యవహరించారు.
వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాన్ని సృష్టించిన సమయంలో అనిత ఆనంద్ పనితీరుపై కెనడాలో ప్రశంసలు కూడా వచ్చాయి. ప్రజలకు వైద్య పరికరాలు, ఆక్సిజన్, మాస్కులు, పీపీ కిట్లు, టీకాలు అందించడంలో అనిత ఆనంద్ ముఖ్యపాత్ర పోషించారు. 1993లో తొలి మహిళా ప్రధానిగా క్యాంపు బెల్ బాధ్యతలను కెనడాకు నిర్వర్తించారు. ఇప్పుడు అన్ని కుదిరితే అనిత ఆనంద్ కెనడాకు ప్రధాని అయ్యే అవకాశం లభించనుంది. 1960 వాదస్కంలో భారత నుంచి కనడాకు వెళ్లి స్థిరపడ్డారు డాక్టర్ సరోజరామ, డాక్టర్ ఎస్వీ ఆనంద్. వీరికి 1967లో అనిత ఆనంద్ జన్మించారు. గ్రామీణ నోవా స్కోటియాలో పుట్టి పెరిగిన మంత్రి ఆనంద్ 1985లో అంటారియోకు వెళ్లారు. అక్కడ ఉన్నత విద్యను అభ్యసించారు. కెనడాకు చెందిన జాన్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం అనిత ఆనంద్ అధికార లేబరల్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనిత ఆనంద రాజకీయ నాయకురాలు గానే కాకుండా న్యాయవాదిగా, పరిశోధకురాలిగా పేరుపొందారు. ప్రస్తుతం కెనడాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనిత ఆనంద్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటే అనిత ఆనందకు మెజారిటీ ఎంపీలు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే లిబరల్ పార్టీ ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.
ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్