Home అంతర్జాతీయ సెకనులో 100 జీబీ డేటా అందించనున్న చైనా -VRM MEDIA

సెకనులో 100 జీబీ డేటా అందించనున్న చైనా -VRM MEDIA

by VRM Media
0 comments
సెకనులో 100 జీబీ డేటా అందించనున్న చైనా


ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలకు చెందిన సంస్థలు, ఇంటర్నెట్ వినియోగంలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ విధంగానే చైనా మరో వినోదమైన ఆవిష్కరణ చేసింది. అత్యంత వేగంగా డేటాను సరఫరా (ట్రాన్స్మిట్) చేయడంలో చైనా కీలక ముందడుగు వేసింది. ఈ విషయంలో స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్ లింకును అధిగమించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్. చైనాకు చెందిన చాంగ్ గ్వాంగ్ సాటిలైట్ టెక్నాలజీ సెకనుకు 100 గిగాబైట్ల డేటాను ట్రాన్స్‌మిట్ చేసేలా అత్యాధునిక హై రిజల్యూషన్ స్పేస్ టు గ్రౌండ్ లేజర్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా జిలిన్-1 ఉపగ్రహం నుండి ట్రక్ పై అమర్చిన గ్రౌండ్ స్టేషన్ కు ఈ డేటాను సెకనులో పంపించింది. ఇది గత రికార్డు కంటే దాదాపు 10 రెట్ల వేగంతో నడిచింది. చాంగ్ గ్యాంగ్ సంస్థ లేజర్ గ్రౌండ్ కమ్యూనికేషన్‌లు అధిపతి చాంగ్ హాంగ్ హాంగ్ దీని గురించి మాట్లాడుతూ స్టార్ లింకు 6జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది అన్నది అధికారికి సమాచారం కాదని చెప్పారు. ఈ విషయంలో తమ మస్కుకు చెందిన స్టార్ లింకు కంపెనీని అధిగమించింది.

మాస్క్ కు చెందిన స్టార్ లింక్ లేజర్ శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఆవిష్కరించింది కానీ దాన్ని శాటిలైట్ టు గ్రౌండ్ కమ్యూనికేషన్ కు ఇప్పటి వరకు వాడలేదని. వారి వద్ద ఈ టెక్నాలజీ ఉండొచ్చు కానీ తాము ఇప్పటికే భారీ స్థాయిలో వినియోగించడం మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ కంపెనీ జిలిన్-1 శ్రేణిలోని ఉపగ్రహాలను 2027 నాటికి పూర్తిగా కక్షలోకి చేర్చనుంది. 100 జీబీపీఎస్ డేటా అంటే 10 పూర్తిస్థాయి సినిమాల పరిమాణంలో ఉంటుంది. దీన్ని చైనా ఒక్క సెకండ్ లో సరఫరా చేయగలిగింది. గతంలో అమెరికాకు చెందిన మస్సాచుసెట్స్ ఇన్ డిగ్రీ ఆఫ్ టెక్నాలజీ, నాసాకు చెందిన టెరాబైట్ డెలివరీ సిస్టమ్ సంస్థ కూడా 100 జీబీపీఎస్ ట్రాన్స్‌మిట్ చేసింది. అయితే తమ పేలోడ్ చాలా పెద్దదని చాంగ్ సంస్థ ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 5జి కమ్యూనికేషన్ వాడుకలో ఉంది. దీనికి ఆధునిక వర్షన్ 6జీ. దీన్ని అత్యధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల వద్ద వినియోగిస్తారు. తాజాగా చైనా 5 జి ఆధారిత అత్యాధునిక మొబైల్ స్టేషను అభివృద్ధి ప్రకటించింది. ఇది యుద్ధ వాతావరణంలో కూడా మూడు స్థాయిల వరకు పదివేల మంది వరకు సురక్షితంగా వేగంగా డేటాను పంపుతుంది. దీన్ని చైనా మొబైల్ కమ్యూనికేషన్ గ్రూప్ ఆ దేశ ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇది పెను మార్పులకు కారణం అవుతుందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల టెక్నాలజీ రంగంలో పోటీని చైనా తీసుకు వస్తున్న ఈ అత్యాధునిక వేగవంతమైన ఇంటర్నెట్ వినియోగం భవిష్యత్తులో అనేక మార్పులకు ఉపకరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,806 Views

You may also like

Leave a Comment