Home తెలంగాణ సకాలంలో రాజన్న ఆలయం పూర్తి – VRM MEDIA

సకాలంలో రాజన్న ఆలయం పూర్తి – VRM MEDIA

by VRM Media
0 comments
సకాలంలో రాజన్న ఆలయం పూర్తి


ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి

ఆలయ విస్తరణ పనుల పరిశీలన

వేములవాడ, నవంబర్ 25 (ఈవార్తలు): వేములవాడ శ్రీ రాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ ప్రభుత్వ పనులను విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమావాల్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆలయ దక్షిణ భాగంలో భారీ యంత్రాలతో పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకు ముందు వేములవాడ ఆర్టీసీ డిపో సమీపంలోని రెండు బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వ విప్ ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. మొత్తం ఎన్ని ఇండ్లు పెట్టారు? ఎప్పటి వరకు పూర్తి చేస్తారో ఆరా తీశారు. మొత్తం రూ. 5 కోట్ల 61 లక్షల వ్యయంతో 144 ఇండ్లు కట్టామని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా మూలవాగుపై నూతన బ్రిడ్జి పనులు, వేములవాడ ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బస్టాండ్ వరకు రోడ్డు, డ్రైనేజ్ పనులను పరిశీలించారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. షవర్లు, కళ్యాణకట్ట, క్యూ లైన్లు పరిశీలించి, ఆలయ ఈఓ, ఇంజనీరింగ్ అధికారులు విప్, ఇంచార్జి కలెక్టర్ సూచనలు చేశారు.

భీమేశ్వర ఆలయంలో పూజలు

భీమేశ్వర ఆలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా విప్, ఇంచార్జి కలెక్టర్ కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఇంచార్జి కలెక్టర్‌కు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వాదం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వేముల ఆర్డీవో రాధాభాయ్, ఆలయ ఈవో రమాదేవి, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు నిర్వహించారు.

Daily Horoscope | ఈ రోజు రాశి ఫలాలు 29 నవంబర్ 2025
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,819 Views

You may also like

Leave a Comment