Home ఎంటర్‌టెయిన్మెంట్ ఆంధ్రా కింగ్‌ని వెనక్కి నెట్టిన ధనుష్.. రామ్‌ పరిస్థితి ఏంటి? – VRM MEDIA

ఆంధ్రా కింగ్‌ని వెనక్కి నెట్టిన ధనుష్.. రామ్‌ పరిస్థితి ఏంటి? – VRM MEDIA

by VRM Media
0 comments
ఆంధ్రా కింగ్‌ని వెనక్కి నెట్టిన ధనుష్.. రామ్‌ పరిస్థితి ఏంటి?



ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత వరస పరాజయాలతో ఉన్న రామ్‌ పోతినేని.. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రంపైనే హోప్స్‌ పెట్టుకున్నాడు. మహేష్‌బాబు దర్శకత్వంలో మైత్రి మేకర్స్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 27న విడుదలైంది. చాలా కాలం తర్వాత రామ్ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్‌ భారీగా లేకపోయినా పికప్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని సినిమాకి వచ్చిన రిజల్ట్‌ని బట్టి అర్థమైంది. స్లోగా టాక్‌ స్ప్రెడ్‌ అయి మంచి సినిమాగా నిలబడుతుందని సినీ ప్రేక్షకులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే మరుసటిరోజు విడుదలైన ధనుష్‌ సినిమా రామ్‌ ఆశలను నీరుగార్చేలా నిర్మించారు.

ధనుష్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ రూపొందించిన ‘రాంజానా’ చిత్రం 2013లో విడుదలై సూపర్‌హిట్‌ అయింది. 36 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 105 కోట్లు కలెక్ట్ చేసింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ‘రంజానా’ చిత్రం సీక్వెల్‌గా ‘తేరే ఇష్క్‌ మే స్టోరీ’ రూపొందించారు. ఈ సినిమాలో ధనుష్‌, కృతి సనన్‌ జంటగా నటించారు. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ నవంబర్‌ 27న రిలీజ్‌ కాగా, ‘తేరే ఇష్క్‌ మే’ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్‌ నవంబర్‌ 28న విడుదలైంది.

‘అమరకావ్యం’ పేరుతో తెలుగులో విడుదలైన ‘తేరే ఇష్క్‌మే’ చిత్రం.. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రానికి గట్టి పోటీ ఇస్తున్నట్టు కలెక్షన్లు వస్తున్నాయి. ఈవారం ప్రధానంగా ధనుష్‌, రామ్‌ మధ్య పోటీ. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లో 141 షోలు పడగా, అందులో 46 మాత్రమే ఫుల్స్‌ అయ్యాయి. ‘అమరకావ్యం’ డబ్బింగ్‌ సినిమా కావడంతో కేవలం 106 షోలు మాత్రమే వేశారు. అయితే అందులో 50 షోలు ఫుల్స్ అవ్వడం సినిమాకి ఉన్న స్టామినాని చెప్పొచ్చు. వరస పరాజయాలతో ఉన్న రామ్‌కి ఆశాదీపంలా కనిపించిన ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రం మంచి టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా ‘అమరకావ్యం’ కంటే వెనకబడి ఉండటం దర్శకనిర్మాతలను కలవరపెడుతోంది. ఈ రెండు సినిమాలు జోనర్స్‌ వేరు కాబట్టి ఏ సినిమాకి లభించే ఆదరణ ఆ సినిమాకి లభిస్తుందని ట్రేడ్‌వర్గాలు కోరుకుంటున్నాయి. అదే జరిగితే ఈ రెండు సినిమాల నిర్మాతలు హ్యాపీ అవుతారు. ముఖ్యంగా రామ్ ఈ సినిమాతో హిట్ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

2,819 Views

You may also like

Leave a Comment