Home ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య వద్దు, కడప ముద్దురౌండ్ టేబుల్ సమావేశంజేఏసీ ఏర్పాటు

అన్నమయ్య వద్దు, కడప ముద్దురౌండ్ టేబుల్ సమావేశంజేఏసీ ఏర్పాటు

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 29

కడప జిల్లా నుండి సిద్దవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలినం గెజిట్ నోటిఫికేషన్ పై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు సిద్ధవటం మండలంలోని బంగారు పేట గంగాభవాని ఆలయ సమీపంలో శనివారం మధ్యాహ్నం సిద్ధవటం మండలం అన్నమయ్య జిల్లాలో విలీనంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు మండల విభజన సాధన కొరకై జేఏసీ ఏర్పాటు చేశారు జేఏసీ చైర్మన్గా, అమర్నాథ్ శర్మ ఉపాధ్యక్షులు నాయబ్ రసూల్ ప్రధాన కార్యదర్శి సాయి సురేష్, కార్య దర్శి డాక్టర్ లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు, శ్రీరామదాసు వెంకట్, డేరంగుల శ్రీకాంత్, బీసీ వెంకటసుబ్బయ్య, జింక శివ, ఉప్పల రామకృష్ణ, రవిశంకర్, సామల, సుబ్రహ్మణ్యం, పుత్త సుధీర్ సభ్యులుగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ అమర్నాథ్ శర్మ మాట్లాడుతూ సిద్ధవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడం చాలా బాధాకరమని రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించి సిద్ధవటం మండలాన్ని రాజంపేటలో విలీనం చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని
కడప జిల్లాలో ఉన్న సిద్ధవటం మండలాన్ని 85 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాయచోటి లో విలీనం చేయడంపై మండల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సోమవారం నుండి జాయింట్ కమిటీ యాక్షన్ తరఫున ఉద్యమాలు చేస్తామని ప్రతి ఒకరు సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు పాల్గొన్నారు

2,819 Views

You may also like

Leave a Comment